శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

కేవైఎసీ పేరుతో మోసం : ఎస్.బి.ఐ ఖాతాదారులకు అలెర్ట్ వార్నింగ్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేసింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారని, అందువల్ల ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎంబెడెడ్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని తమ బ్యాంకు చెందిన 40 కోట్ల మంది ఖాతాదారులకు హెచ్చరించింది. 
 
రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని కోరింది. పొరపాటున లింక్‌పై క్లిక్ చేస్తే బ్యాంకు బ్యాలెన్స్ జీరోగా మారిపోవచ్చని తెలిపింది. ఎస్.బి.ఐ పేరుతో ఏదైనా సందేశం వచ్చినపుడు, అది సరైనదా కాదా అని బ్యాంక్ షార్ట్ కోడ్‌ను తనిఖీ చేయాలని సూచించింది. 
 
ప్రధానంగా ఎంబెడెడ్ లింక్‌పై ఎస్ఎంఎస్ ద్వారా కేవైసీనిసి అప్‌డేట్ చేయమని తమ కస్టమర్లను ఎపుడూ అడగమని బ్యాంకు హెచ్చరించింది. దేశంలో డిజిటిల్ లావాదేవీలు పెరగడంతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని పేర్కొంది.