శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (12:08 IST)

ఎస్బీఐ ఖాతాదారులకు అలెర్ట్ : ఆ సర్వీసులకు తాత్కాలిక బ్రేక్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. 
 
ఆ ప్రకారంగా జూలై 10వ తేదీన 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్‏లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ఎస్‏బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు. 
 
అలాగే ఎస్బీఐ తమ కస్టమర్లను మరో విషయంలో అలర్ట్ చేసింది. కస్టమర్లు ఆన్‏లైన్ అకౌంట్ల పాస్‏వర్డ్‏లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. అప్పుడే మోసాల బారినపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని కస్టమర్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించింది.