శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (11:48 IST)

ఫోనులో క్రెడిట్ - డెబిట్ కార్డుల సమాచారం ఉందా...?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భద్రతా పరంగా ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆన్‌లైన్ మోసాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో బ్యాంకులే తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. ఆన్‌లైన్ మోసగాళ్లబారినపడుకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు హెచ్చరికలు చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా సెల్‌ఫోన్లలో దాచుకుంటే వెంటనే దానిని డిలీట్ చేయాలని సూచించింది. 
 
ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్ సహా కీలక విషయాలు ఏవీ ఫోన్‌లో ఉండకుండా చూసుకోవాలని కోరింది. అవి కనుక ఫోన్‌లో ఉంటే మోసాల బారినపడటం ఖాయమని, కాబట్టి అలాంటి సమాచారమేదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలని స్టేట్‌బ్యాంకు సూచించింది.