బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (22:08 IST)

వినియోగదారులకు 3-ఇన్-1 ఖాతాలు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో SMC గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ భాగస్వామ్యం

image
SMC గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తన బ్యాంక్ వినియోగదారులకు ఆన్‌లైన్ ట్రేడింగ్ సేవలు అందించడం కోసం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఉజ్జీవన్ SFB)తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సిద్ధమైనట్లు ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా అందించే సేవింగ్స్, డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలతో కూడిన సేవల ద్వారా, ఉజ్జీవన్ SFB వినియోగదారులకు ఇబ్బంది లేని మరియు అనుకూలమైన వ్యాపార అనుభవం లభించనుంది.
 
76 లక్షల మందికి పైగా వినియోగదారులకు సేవలందిస్తూ, విస్తృత స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా ఉనికి కలిగిన ఉజ్జీవన్ SFBతో భాగస్వామ్యం ద్వారా, SMC గ్లోబల్ తన క్లయింట్ బేస్‌ మరింత విస్తరించే అవకాశం ఏర్పడింది. ఈ భాగస్వామ్యం ద్వారా, ఉజ్జీవన్ SFB వినియోగదారుల ట్రేడింగ్ మరియు డీమ్యాట్ ఖాతాలతో సంబంధాన్ని SMC గ్లోబల్ నిర్వహిస్తుంది. బ్యాంక్ వినియోగదారులకు పూర్తి మరియు డిస్కౌంట్ బ్రోకరేజీ సేవలను SMC అందిస్తుంది. ఇప్పటికే ఉజ్జీవన్ SFB వినియోగదారులుగా ఉన్నవారు ఉజ్జీవన్ SFB మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు.
 
ఈ సందర్భంగా, SMC గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు CEO శ్రీ. అజయ్ గార్గ్ మాట్లాడుతూ, “ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని SMC ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మా బ్యాంక్ కస్టమర్లకు మొబైల్ మరియు డెస్క్‌టాప్ రెండింటిలోనూ వేగవంతమైన, సురక్షితమైన మరియు అవాంతరాలు లేని ట్రేడింగ్ మరియు పెట్టుబడి అనుభవాలు అందించే వాగ్దానాన్ని ఇది అందించింది. భారతదేశం వ్యాప్తంగా SMC గ్లోబల్ తన ఉనికిని మరియు క్లయింట్ బేస్‌ను బలోపేతం చేయడానికి మరియు పటిష్టం చేయడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుంది.
 
ఈ భాగస్వామ్యం గురించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ MD మరియు CEO ఇట్టిరా డేవిస్ మాట్లాడుతూ, “మా వినియోగదారులు సంపద సృష్టించుకోవడానికి అదనపు మార్గం అందించడం కోసం SMC గ్లోబల్‌తో ఈ భాగస్వామ్యానికి సిద్ధమైనట్లు మేము సంతోషంగా ప్రకటిస్తున్నాము. మా విలువైన వినియోగదారులకు మెరుగైన పెట్టుబడి అవకాశాలు అందించడానికి, వారి ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి వీలుగా మా నిబద్ధతలో ఒక కీలక మైలురాయిని ఈ భాగస్వామ్యం సూచిస్తుంది అని అన్నారు.