గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (09:07 IST)

వామ్మో.. బ్యాంకు సేవలు వరుసగా ఐదు రోజులు బంద్

దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలు స్తంభించిపోనున్నాయి. అదీకూడా వరుసగా ఐదు రోజుల పాటు. దీనికి కారణం పండుగ దినాలు రావడంతో రిజర్వు బ్యాంకు సిబ్బంది రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడమే. ఫలితంగా సెప్టెంబరు

దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలు స్తంభించిపోనున్నాయి. అదీకూడా వరుసగా ఐదు రోజుల పాటు. దీనికి కారణం పండుగ దినాలు రావడంతో రిజర్వు బ్యాంకు సిబ్బంది రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడమే. ఫలితంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వరుసగా బ్యాంకు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగనుంది.
 
సెప్టెంబరు ఒకటో తేదీన మొదటి శనివారం పనిదినం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం సెలవు. లేదంటే ఒక పూట మాత్రమే పని చేస్తాయి. 2వ తేదీ ఆదివారం. ఇక 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు. అనంతరం 4, 5 తేదీల్లో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫోరం(యూఎఫ్ఆర్‌బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది. 
 
ఆ రెండు రోజులు ఆర్బీఐ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టనున్నారు. ఫలితంగా ఆర్బీఐ ఉద్యోగుల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అయితే, ప్రైవేట్ బ్యాంకు సేవలు మాత్రం యధావిధిగా కొనసాగే అవకాశాలు మాత్రం ఉన్నాయి.