సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

మార్చి 31వ తేదీ ఆదివారం కూడా పని చేయనున్న బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

banks
మార్చి 31వ తేదీన ఆదివారం. ఆ రోజున కూడా అన్ని బ్యాంకులు పని చేస్తాయని భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. సాధారణంగా మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం ముగింపు చివరి రోజు. దీంతో ఆ రోజు బ్యాంకులు పని చేసినప్పటికీ సాధారణ లావాదేవీలు ఏవీ ఉండవు. అయితే, ఈ యేడాది మార్చి 31వ తేదీ ఆదివారం రావడంతో బ్యాంకులు సెలవు మూసివేసివుంటాయని ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. 
 
కానీ, ఈ మార్చి 31వ తేదీ ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఆ రోజున సాధారణ లావాదేవీలు ఏవీ జరగకపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ పరమైన అన్ని లావాదేవీలు జరపవచ్చనే దానిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరమైన అన్ని రకాల లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. అలాగే, ఇతర ఖాతాదారులు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఆదివారం కింద సేవలు పొందవచ్చు.. మార్చి 31వ తేదీన నెఫ్ట్, ఆర్టీజీఎస్ విధానం ద్వారా అర్థరాత్రి 12 గంటల వరకు లావాదేవీలు జరపవచ్చు. ప్రభుత్వ ఖాతాదాలకు సంబంధించి ఏవైనా చెక్కులను క్లియరింగ్ కోసం బ్యాంకులు సమర్పించుకోవ్చని ఆర్బీఐ తెలిపింది. కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాల నుంచి పెన్షన్ చెల్లింపులు, ప్రత్యేక డిపాజిట్ పథకం, 1975, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 1968, కిసాన్ వికాస్ పత్ర 2014, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004కు సంబంధించిన సేవలు మార్చి 31వ తేదీన పొందవచ్చని పేర్కొంది.