Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్పైస్ జెట్ నుంచి ''మెగా మాన్‌సూన్‌ సేల్'': రూ.699కే పలు రూట్ల మధ్య టిక్కెట్లు

గురువారం, 29 జూన్ 2017 (11:00 IST)

Widgets Magazine

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తాము రూ.699కే పలు రూట్ల మధ్య విమాన టికెట్‌లను అందించే అద్భుత ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నిర్ణీత సంఖ్య‌లో మాత్ర‌మే ఉన్న ఈ టికెట్ల‌ను గురువారం నుంచి వ‌చ్చేనెల‌ 4 వరకు బుక్ చేసుకోవ‌చ్చ‌ునని తెలిపింది. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వ‌చ్చేనెల‌ 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది.
 
జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్ర‌యాణించాల‌నుకుంటున్న ప్రయాణీకుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. బుకింగ్ చేసుకున్న ప్ర‌యాణికుల‌కు మ‌రో ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. వారిలో ప‌లువురిని లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్‌, మాలే, కొలంబో, బ్యాంకాక్‌ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్‌ను ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లను ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లు, మొబైల్ యాప్‌తో పాటు కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్ అంటే మేక్‌మైట్రిప్, యాత్ర, స్కైన్‌స్కానర్ వంటి వెబ్ సైట్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకునే వారి టిక్కెట్లు రీఫండబుల్ అంటూ స్పైస్ జెట్ తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇక తీరినట్టేనా? ప్రారంభమైన రూ.200 నోట్ల ముద్రణ

నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు ...

news

మేడ్ ఇన్ ఇండియా: చైనా వన్ ప్లస్ 5 తయారీ ఎక్కడో తెలుసా? నోయిడాలో!

చైనాకు చెందిన ఈ ఫోన్ తయారీ ఎక్కడ జరుగుతుందో తెలుసా..? మనదేశంలోనే. అదీ, నోయిడాలో. నోయిడాలో ...

news

ఇకపై ఆధార్ కార్డు లేనిదే పాన్ కార్డు నో: పాన్‌ కార్డుకు ఆధార్‌కు లింకు ఉండాల్సిందే!

ఆధార్ కార్డ్ లేనిదే ఇకపై పాన్ కార్డు తీసుకోవడం కుదరదు. ఎందుకంటే? జూలై ఒకటో తేదీ నుంచి ...

news

వందసార్లు చెప్పినా అదే తప్పు చేస్తే ఇలాగే మడతపడుతుంది మరి

డిట్ కార్డు సమాచారం, బ్యాంకు ఖాతాల సమాచారం, డెబిట్ కార్డు సమాచారం కూడా ఎవరికీ ...

Widgets Magazine