గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:53 IST)

భారతదేశపు మొట్టమొదటి ఫుడ్‌-గ్రేడ్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ సదుపాయం ప్రారంభించిన శ్రీచక్ర పాలీప్లాస్ట్‌

సుప్రసిద్ధ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ మరియు వ్యర్థ నిర్వహణ కంపెనీ శ్రీ చక్ర పాలీప్లాస్ట్‌ (శ్రీ చక్ర) నేడు, తమ ఆధునీకరించిన ఫెసిలిటీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించింది. భారతదేశంలో ఫుడ్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన రీసైకిల్డ్‌ పాలిథ్లీన్‌ టెరిఫాథలెట్‌ (పెట్‌) పెలెట్స్‌ ఉత్పత్తి చేస్తున్న మొట్టమొదటి కర్మాగారం ఇది. ఈ కంపెనీ తమ నూతన పోలియోలెఫిన్స్‌ రీసైక్లింగ్‌ సదుపాయాన్ని సైతం ప్రారంభించామని వెల్లడించింది.
 
ఇది డియోడరైజ్డ్‌ బాటిల్‌ టు బాటిల్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన పోల్యోలెఫిన్‌ పెలెట్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ కంపెనీ 10 మిలియన్లకు పైగా యుస్‌ డాలర్లను తమ రీసైక్లింగ్‌ సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం పెట్టుబడి పెట్టింది. ఇది అత్యధిక గ్రేడ్‌ రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ను భారతదేశంలోని వినియోగదారులతో పాటుగా యూరోప్‌ మరియు యునైటెడ్‌ స్టేట్స్‌ లాంటి అంతర్జాతీయ మార్కెట్‌లకు సైతం సరఫరా చేయనుంది.
 
శ్రీ చక్ర యొక్క ప్రపంచ శ్రేణి ఫెసిలిటీలో యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతించిన సాంకేతికత ఉంది. దీనిని అత్యున్నత నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కోసం ప్రపంచంలో సుప్రసిద్ధ సాంకేతిక ప్రదాత స్టార్లింగర్‌ అందించింది. ఇది కంపెనీ యొక్క సామర్థ్యంను విస్తరించడంతో పాటుగా భారతదేశంలో అతిపెద్ద సాలిడ్‌ స్టేట్‌ పాలీమెరైజ్డ్‌ (ఎస్‌ఎస్‌పీ) పెట్‌ ప్రాసెసర్‌గానూ నిలుపుతుంది.
 
భారతదేశంలో మొట్టమొదటి ప్రీమియం ఫుడ్‌ గ్రేడ్‌ నాణ్యత రీసైక్లింగ్‌ సదుపాయంగా, శ్రీ చక్ర  ఉత్పత్తి చేసే  అత్యున్నత నాణ్యత కలిగిన రీసైకిల్డ్‌ ప్లాస్టిక్స్‌లో ఫుడ్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన పెట్‌ పెలెట్స్‌ సైతం ఉంటాయి. వీటిని ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ప్యాకేజీలు అయినటువంటి నీరు, కార్బోనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ మరియు జ్యూస్‌ బాటిల్స్‌, టేక్‌ ఎవే కంటెయినర్స్‌; అత్యున్నత నాణ్యత కలిగిన డియోడరైజ్డ్‌ పోలియోలెఫిన్‌ పెలెట్స్‌ వంటి వాటి కోసం వినియోగించవచ్చు. వీటిని ఇంటిలో మరియు పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తి ప్యాకేజింగ్‌ అయినటువంటి లోషన్‌, షాంపూ, డిటర్జెంట్‌ బాటిల్స్‌ కోసం కూడా వినియోగించవచ్చు.
 
శ్రీ చక్ర సీఈవో మరియు సహ వ్యవస్థాపకులు రవీంద్ర వెంకట మాట్లాడుతూ ‘‘ఆధారపడతగిన, అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్స్‌ను  విప్లవాత్మక సాంకేతికతను వినియోగించి సృష్టించడం ద్వారా వర్జిన్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని బ్రాండ్‌ యజమానులు తగ్గించుకోవడంలో సహాయపడాలనే విధానంతో శ్రీ చక్ర వద్ద మేము కార్యకలాపాలను నిర్వహిస్తుంటాము. నేడు మేము వినియోగంలోకి తీసుకువచ్చిన నూతన, ప్రపంచ శ్రేణి సాంకేతికత, ఫుడ్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ను మా వినియోగదారుల కోసం ఉత్పత్తి చేసేందుకు మాకు అనుమతించడమే కాదు, స్థానికంగా సేకరించిన  ప్లాస్టిక్‌కు నూతన జీవితాన్నీ ప్రసాదించి, అది వాతావరణంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
 
భారతదేశంలో ఈ ప్రమాణాలను అందుకున్న మొట్టమొదటి కంపెనీగా నిలువడం పట్ల గర్వంగా ఉన్నాము మరియు వాతావరణాన్ని శుభ్రపరచడం ద్వారా ఈ ప్రపంచాన్ని అత్యుత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు మా కార్యకలాపాలను కొనసాగించనున్నాం’’ అని అన్నారు.
 
యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇండియా వెల్లడించే దాని ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 15 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంటే దానిలో కేవలం నాలుగోవంతు మాత్రమే  రీ సైకిల్‌ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 10%కు పైగా పెట్‌ కాగా దీనిలో 90% వరకూ రీసైకిల్‌ చేస్తున్నారు. అయితే ఇది సాధారణంగా అత్యున్నత నాణ్యతతో ఉండటం లేదు. ఈ కారణంగా పునర్వినియోగ చక్రంలో వీటి స్ధాయి తక్కువగానే ఉంటుంది. దాదాపుగా వర్జిన్‌ ప్లాస్టిక్‌ నాణ్యతను ఫుడ్‌ గ్రేడ్‌ రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ కలిగి ఉంటుంది. తద్వారా భారతదేశంలో సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఉన్న అవరోధాలను అధిగమించేందుకు శ్రీచక్రకు అనుమతిస్తుంది మరియు రీసైక్లింగ్‌ వాల్యూ చైన్‌పై సానుకూల ప్రభావమూ చూపుతుంది.
 
‘‘భారతదేశంలో సర్క్యులర్‌ ఎకనమీ సృష్టించడంలో అగ్రగామిగా శ్రీచక్ర ఉంది. దీని సాంకేతిక సరఫరాదారునిగా మేము చాలా గర్వంగా ఉన్నాము’’ అని పౌల్‌ నీడెల్‌, కమర్షియల్‌ హెడ్-స్టార్లింగర్‌ రీసైక్లింగ్‌ టెక్నాలజీ అన్నారు. ‘‘ఎస్‌ఎస్‌పీ ట్రీట్‌మెంట్‌తో మా నూతన స్టార్లింగర్‌ పెట్‌ బాటిల్‌-టు-బాటిల్‌ రీసైక్లింగ్‌ లైన్‌ తో శ్రీచక్ర ఇప్పుడు తమ ఉత్పత్తుల పరిధిని విస్తరించడంతో పాటుగా అతి ముఖ్యమైన ఫుడ్‌ గ్రేడ్‌ ఆర్‌పెట్‌లో ప్రవేశించింది. ఈ అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులతో శ్రీ చక్ర ఇప్పుడు భారతీయ ప్లాస్టిక్స్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టించనుంది’’ అని అన్నారు.
 
శ్రీచక్రలో డిసెంబర్‌ 2020లో పెట్టుబడులు పెట్టిన సర్క్యులేట్‌ క్యాపిటల్‌ సీఈవో, ఫౌండర్‌- రాబ్‌ కప్లాన్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో రీసైక్లింగ్‌ మరియు వ్యర్థ నిర్వహణ పరిశ్రమకు నూతన బెంచ్‌మార్క్‌ను నేడు ఈ మైలురాయి ఏర్పరచనుంది. శ్రీచక్ర యొక్క మెరుగైన శక్తి, సామర్థ్యంతో ఇప్పుడు మరింతగా ప్లాస్టిక్‌లో ఆర్ధిక విలువను ఒడిసిపట్టడంతో పాటుగా సర్క్యులర్‌ ఎకనమీని మరింతగా పెంపొందించడమూ వీలవుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్‌ వ్యర్ధాల సమస్యనూ పరిష్కరించడమూ సాధ్యమవుతుంది. శ్రీ చక్రలో వ్యూహాత్మక పెట్టుబడిదారునిగా క్యాపిటల్‌ ఓషన్‌ ఫండ్‌ సర్క్యులేట్‌ చేయడం ద్వారా వృద్ధి వేగవంతం చేయడం మరియు చూపే ప్రభావం పరంగా ఈ నూతన ఫెసిలిటీ అందించే అవకాశాల పట్ల ఆసక్తిగా ఉన్నాం’’ అని అన్నారు.
 
అదనంగా, ఈ పెట్టుబడులు ఇప్పుడు శ్రీ చక్ర తమ బృందాన్ని రెండు రెట్లకు పెంచుకునేందుకు అనుమతిస్తుంది. స్ధానిక సమాజం నుంచి 200 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోనున్నారు. స్లార్లింగర్‌ టెక్నాలజీ మరియు బృందంతో  శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సైతం ఇది అందించనుంది. శ్రీచక్ర ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పలు కన్స్యూమర్‌గూడ్స్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికి  చర్చలు జరుపుతుంది  మరియు తమ కార్యకలాపాలను మరింత  వృద్ధి చేయాలని భావిస్తుంది.