Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సునీల్ మిట్టల్ దానగుణం...

శుక్రవారం, 24 నవంబరు 2017 (07:32 IST)

Widgets Magazine
sunil mittal

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ వ్యవస్థాపకుడు సునీల్‌ మిట్టల్ తన దానగుణం చాటుకున్నారు. తమ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటాను దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. భారతీ కుటుంబానికి చెందిన మొత్తం సంపదలో 10 శాతం వాటా అయిన రూ.7 వేల కోట్లను తమ దాతృత్వ సంస్థ భారతీ ఫౌండేషన్‌కు అందించనున్నట్లు మిట్టల్ ప్రకటించారు. 
 
సమాజంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న యువతకు ఉన్నత, ఉచిత విద్యను అందించేందుకు సత్యభారతి పేరుతో యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌ వంటి సాంకేతిక విద్యను బోధించనున్నట్లు తెలిపారు. ఈ వర్శిటీని ఉత్తరభారతంలో ఏర్పాటుచేస్తామన్నారు. 
 
కాగా, ఇటీవల ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని తమ సంపదలో సగ భాగాన్ని దాతృత్వానికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. తమ సంపదలో సగం భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన 'ది గివింగ్‌ ప్లెడ్జ్'లో నీలేకని దంపతులు చేరారు. ఇప్పటికే విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, బయోకాన్‌ ఛైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఈ పథకంలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం.. త్వరలో చెక్కులకు రాంరాం!

దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా ప్రస్తుతం చెలామణీలో ...

news

కోడి ధర తగ్గితే గుడ్డు ధర కొండెక్కి కూర్చుంది..

కోడి ధర తగ్గితే.. గుడ్డు ధర కొండెక్కింది. నెలలోనే కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగితే.. చికెన్ ...

news

నల్లధన భారతీయుల చిట్టా వెల్లడిద్దాం : స్విస్ పార్లమెంట్ ప్యానెల్

భారతీయ నల్లధన కుబేరుల గుట్టు త్వరలోనే బట్టబయలుకానుంది. స్విస్ బ్యాంకులో మూలుగుతున్న ...

news

ఇకపై అకౌంట్ పోర్టబులిటీ : ఒకే బ్యాంక్ ఒకే అకౌంట్

ఇప్పటివరకు మొబైల్ పోర్టబులిటీ అనే మాట విన్నాం. ఇది కేవలం మొబైల్ నంబర్లకి మాత్రమే ఇలాంటి ...

Widgets Magazine