ముఖేష్ అంబానీకి బెదిరింపులు-తెలంగాణ యువకుడి అరెస్ట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి గత కొంత కాలం నుంచి బెదిరింపు మెయిల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 27న మరోసారి అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇంకా రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే మీమ్మల్ని అంతమొందిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురై నవంబర్ 1న రూ.400 కోట్లు ఇవ్వకుంటే ముఖేష్ అంబానీని చంపేస్తాంటూ గట్టిగా వార్నింగ్‌తో మెయిల్స్ పంపారు.
వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణ జరపగా బెదిరింపు మెయిల్స్ పంపింది ఎవరో కాదు.. తెలంగాణకు చెందిన షాదాబ్ ఖాన్ అనే యువకుడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.