గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

కొత్త యేడాదిలో టెలికాం కంపెనీల బాదుడు...

telecom companies
కొత్త సంవత్సరంలో దేశంలోని టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను 10 శాతం మేరకు పెంచనున్నాయి. వచ్చే మూడు నెలల్లో అంటే మార్చి నెలాఖరు నాటికి పది శాతం మేరకు టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించాయి. ఈ మేరుక ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ తెలిపింది. 
 
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనివున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, 5జీ సేవల కారణంగా తెలికాం సంస్థలపై భారం పెరుగుతోంది. ఫలితంగా టారిఫ్ పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని జెఫెరిస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో సంస్థ 2023, 24, 25 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికంలో టారిఫ్‌లను పెంచనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
గత కొంతకాలంగా పెట్టుబడులతో పాటు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. అదేసమయంలో రాబడి చాలా మేరకు తగ్గిపోయింది. దీంతో వినియోగదారులపై భారం మోపక తప్పదని పేర్కొంటున్నాయి. గత ఆర్థిక  సంవత్సరం జియో 0.8 శాతం వొడాఫోన్ ఐడియా ఒక శాతం, ఎయిర్‌టెల్ 4 శాతం మేరకు ఏఆర్పీయూను పెంచిన విషయం తెల్సిందే.