మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (12:40 IST)

బంగారం ధర కొద్దిగా తగ్గింది... దూసుకుపోతున్న వెండి ధర

బంగారం ధరలు మంగళవారం నాడు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 మేరకు స్వల్పంగా తగ్గింది. ఫలితంగా రూ.38,990 నుంచి రూ.38,980 మేరకు బంగారం ధరలు తగ్గాయి.
 
24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా వుంది. 10 గ్రాముల బంగారం ధర రూ.42,530 వద్ద నిలకడగా వుంది. బంగారం ధరలు ఇలా వుంటే వెండి ధర అమాంతం పెరిగింది. కేజీ వెండి ధర రూ. 300 మేరకు పెరిగి రూ. 49,300కి చేరింది.