Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికాలో పాకిస్థాన్ బ్యాంక్ మూసివేత

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:25 IST)

Widgets Magazine
habib bank limited

అమెరికాలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ జాతీయ బ్యాంకును మూసివేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బ్యాంకును అమెరికా మూసివేయించింది. పాకిస్థాన్ దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ (హెచ్.బి.ఎల్) ఒకటి. ఇది 40 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్‌లోనూ ఈ బ్యాంక్ సేవ‌లు అందిస్తోంది. అయితే ఈ బ్యాంక్ ఉగ్ర‌వాదుల‌కు డ‌బ్బు సాయం చేస్తున్న‌ద‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. 
 
2006లోనే ఆ ప‌ని మానుకోవాల‌ని అమెరికా ఈ బ్యాంక్‌ను హెచ్చ‌రించింది. ఆ త‌ర్వాత కూడా ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్న‌ది. అయినా హ‌బీబ్ బ్యాంక్ తీరు మార‌క‌పోవ‌డంతో ఇక న్యూయార్క్ శాఖ‌ను మూసేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆ బ్యాంక్‌కు రూ.1437 కోట్ల భారీ జ‌రిమానాను కూడా విధించింది అక్క‌డి విదేశీ బ్యాంకుల నియంత్ర‌ణ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఫ్లిప్‌కార్ట్‌లో 90 శాతం డిస్కౌంట్స్‌... ఫెస్టివల్ బిగ్ ఆఫర్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ బిగ్ ఆఫర్ పేరుతో 90 శాతం మేరకు ...

news

ఆన్‌లైన్‌ బదిలీలో నగదు మరో ఖాతాలోకి వెళ్తే ఏం చేయాలి?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ...

news

స్కూట్ ఎయిర్‌లైన్స్ ఆఫర్... రూ.12 వేలకే యూరప్ ప్రయాణం

సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఒకటైన స్కూట్ ఎయిర్‌‌లైన్స్ సంస్థ ఓ బంపర్ ...

news

పెద్ద నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయం.. అట్టర్ ఫ్లాప్ : రఘురాం రాజన్

పెద్ద నోట్ల రద్దుపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. నోట్ల ...

Widgets Magazine