బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (10:53 IST)

అన్‌ రిజర్వుడ్ టిక్కెట్ల కోసం సరికొత్త యాప్

అన్ రిజర్వుడ్ టిక్కెట్ల కోసం సరికొత్త యాప్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రద్దీ సమయాల్లో ఈ టిక్కెట్లను సులభంగా పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను రైల్వే సమాచార వ్యవస్థ రూపొందించింది.

అన్ రిజర్వుడ్ టిక్కెట్ల కోసం సరికొత్త యాప్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రద్దీ సమయాల్లో ఈ టిక్కెట్లను సులభంగా పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను రైల్వే సమాచార వ్యవస్థ రూపొందించింది.
 
వాస్తవానికి ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఆన్‌లైన్, స్మార్ట్‍ఫోన్ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే, రిజర్వేషన్ అవసరం లేని సాధారణ ప్రయాణికులు కూడా ఈ టిక్కెట్లను పొందేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. 
 
'యూటీఎస్ ఆన్ మొబైల్' పేరిట ఈ యాప్ అందుబాటులోకి రాగా, నగదును రైల్వే వాలెట్‌లో జమ చేసుకుని నెలవారీ టికెట్లు, ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్లాట్ ఫాం టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 
 
ఏదైనా టికెట్‌ను రద్దు చేసుకుంటే, వాలెట్‌లోకి జమ అవుతాయి. తొలుత పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పించి యాప్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా రద్దీ సమయాల్లో టిక్కెట్‌ను ఎక్కడినుంచైనా పొందవచ్చు.