యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా
యస్ బ్యాంకుపై ఆర్బీఐ నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల పాటు మారటోరియం విధించింది. ఈ 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్ విత్‌డ్రాలపైనా పరిమితి పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అకౌంట్లు కలిపి రూ.50 వేలకు మించి విత్‌డ్రాకు అనుమతించవద్దని ఆదేశించింది.
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంకు చేసే ఖర్చులపైనా పరిమితి విధించింది. ఒక్కో ఐటమ్కు సంబంధించి రూ.50 వేలకు మించి ఖర్చు చేయవద్దని ఆదేశించింది.
శుక్రవారం నుంచి ఎటువంటి లోన్లు జారీ చేయవద్దని, రెన్యువల్ చేయవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అద్దె, ట్యాక్సుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. అలాగే యస్ బ్యాంక్ బోర్డును తక్షణం రద్దు చేస్తున్నట్టు గురువారం స్పష్టం చేసింది.