గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (13:58 IST)

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 180 పోస్టులు

AAI Recruitment 2020
మొత్తం 180 పోస్టులను భర్తీ చేసేందుకుగాను.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2019 మార్కుల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఏఏఐ ప్రకటించింది. 
 
ఇకపోతే.. 180 పోస్టుల్లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 150, ఎలక్ట్రికల్‌‌లో 15, సివిల్‌లో 15 పోస్టుల చొప్పున ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 2 వరకు అధికారిక వెబ్‌సైట్ aai.aeroలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏఏఐ వెల్లడించింది.
 
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 3
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 2.