గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (16:33 IST)

ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ : 250 పోస్టుల భర్తీకి కోసం..

Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రూ.250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. 
 
ఆసక్తిగల అభ్యర్థులు గురువారం ఉదయం 11.30 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ నెల 24వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి వుంటుంది.