ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?

Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:50 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 555 కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలా 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి అందుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. ఇందు కోసం రూ.24కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ శిక్షణ పొందాలనుకునేవారు సీఎం యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.  దీనిపై మరింత చదవండి :