గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (16:03 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఎపుడంటే!!

exam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయనుంది. సోమవారం నుంచి మూల్యాంకన పునఃపరిశీలన చేయనున్నారు. ఈ వారంతంలోగా ఫలితాలను విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ వారాంతంలోగా ఫలితాలను విడదుల చేసేందుకు ఏపీ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుందన్నారు. సోమవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంను పునఃపరిశీలన చేయనున్నారు. 
 
అనంతరం మార్కులను డిజటల్‌‍గా నమోదు చేసి ఫలితాలు విడుదల చేస్తారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటో నుంచి మార్చి 20 వరకు జరిగాయి. ఫస్టియర్, ద్వితీయానికి కలిపి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో ఫలితాలతో ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లుచేస్తుంది.