గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (21:43 IST)

ఏపీలో జాబ్ మేళా.. మొత్తం 300 ఖాళీలు

Jobs
ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో నియామకాల కోసం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డెక్కన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో పలు పోస్టులను భర్తు చేయనున్నారు. 
 
జాబ్ మేళాలో భాగంగా ప్రాసెస్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ట్రెయినీ కెమిస్ట్ పోస్టులను భర్తు చేయనున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 200 ఖాళీలు వున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్‌సీ పూర్తి చేసి వుండాలి. 
 
ప్రాసెస్ డెవల్మప్‌మెంట్ విభాగంలో 100 ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.