ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:40 IST)

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కటాఫ్ మార్కులు తగ్గనున్నాయోచ్!?

neet exam
అవును.. నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కటాఫ్ మార్కులను తగ్గించనున్నారు. ఇంకా ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. వివరాల్లోకి వెళితే.. జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు ఎంతో ప్రాధాన్యత ఉంది.
 
ఈ ఏడాది నీట్ పరీక్ష ఇటీవల ముగిసింది. దేశంలో 497 నగరాలతో పాటు, విదేశాల్లో 14 నగరాల్లో నిర్వహించారు. అభ్యర్థులంతా ఇప్పుడు నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.  
 
గతేడాది నీట్‌లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి కటాఫ్ పర్సంటైల్ 50 కాగా, కటాఫ్ స్కోర్ 138- 720 మార్కుల మధ్య ఉండేది. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ 40, కటాఫ్ స్కోర్ 108 - 137 మార్కులు. అన్‌రిజర్వ్‌డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ (PH) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకైతే 122- 137 మార్కులు కటాఫ్‌గా, 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 
  
ప్రతి ఏటా నీట్ కోసం రెండు వేర్వేరు కటాఫ్‌లను విడుదల చేస్తారు. ఈ ఏడాది నీట్ -2022 కటాఫ్ (ఎక్స్‌పెక్టెడ్) నీట్ పాస్ కావాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించాలి. ఈ ఏడాది నీట్ కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 
 
కటాఫ్ కూడా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే, నీట్ 2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. కాగా, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, పరీక్ష క్లిష్టత స్థాయి వంటి అనేక అంశాలపై కటాఫ్ స్కోర్ ఆధారపడి ఉంటుంది.