శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (18:06 IST)

ఫిక్కీ- ఓయో ఆతిథ్య రంగ పరిశ్రమలో తొలిసారిగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సు

ఆతిథ్య రంగ పరిశ్రమపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండటమే కాదు, హోటల్ వ్యాపారం జరిగే తీరు మరియు వారి కార్యకలాపాల నిర్వహణను సమూలంగా మార్చింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మరియు ప్రపంచంలో సుప్రసిద్ధ హోటల్స్ మరియు హోమ్స్ లో ఒకటైన ఓయోలు ఏకతాటిపైకి రావడంతో పాటుగా ఆన్‌లైన్ శిక్షణ మరియు సర్టిఫికేషన్ కోర్సును అభివృద్ధి చేయడంతో పాటుగా డిజైన్ చేశాయి.
 
ఈ కోర్సును ప్రధానంగా ఆతిథ్య రంగంను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. ఈ కోర్సు ప్రధానంగా శానిటైజేషన్ మార్గదర్శకాలను పునః రూపకల్పన చేయడం మరియు కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా హోటల్‌లో ఒకరితో ఒకరు సంప్రదించేఅవకాశాలను తగ్గించడాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ సర్టిఫికేషన్ కోర్సు భారతదేశంలో వేలాది బడ్జెట్, మిడ్-సెగ్మంట్, బొటిక్ హోటల్స్, హోమ్ స్టేలతో పాటుగా ఆతిథ్య రంగ నిపుణులకు సహాయపడనుంది. తద్వారా భారతప్రభుత్వ భద్రత మరియు పరిశుభ్రతా ప్రమాణాలతో పాటుగా పరిశ్రమ బెంచ్‌మార్క్స్, అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా తమ భద్రతను మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. ఈ కోర్సు ఆంగ్లం మరియు హిందీ భాషలలో లభ్యమవుతుంది.
 
ఈ సర్టిఫికేషన్ కోర్సులో తొమ్మిది శిక్షణా మాడ్యుల్స్ ఉంటాయి. హోటల్స్ మరియు ఆతిధ్య రంగ నిపుణులు అతి ముఖ్యమైన భద్రతా మార్గదర్శకాలను అమలు చేసేందుకు సహాయపడే రీతిలో తీర్చిదిద్దారు. ఈ మాడ్యుల్స్‌లో హోటల్, సిబ్బంది, అతిథులు, ఫ్రంట్-ఆఫీస్, ఎఫ్ అండ్ బీ సర్వీస్, హౌస్ కీపింగ్, గెస్ట్ రూమ్ క్లీనింగ్ మరియు ఫుడ్ ప్రొడక్షన్ ఎడ్వైజరీలు ఉంటాయి. దీనిలో అనుమానిత కోవిడ్ లేదా కోవిడ్ పాజిటివ్ అతిథులను ఏ విధంగా నిర్వహించాలన్న సూచన సైతం భాగంగా ఉంటుంది. ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సు కోసం సంబంధిత వెబ్ సైట్ చూడవచ్చు.
 
ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సు కోసం ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మౌలిక సదుపాయాలు మరియు ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అమలును ఫిక్కీ సాధ్యం చేయడంతో పాటుగా మద్దతునందిస్తుంది. ఆతిథ్య రంగంలో ఈ కోర్సు పట్ల అవగాహనను ఫెడరేషన్ కల్పించడంతో పాటుగా కోర్సు పూర్తి అయిన తరువాత సర్టిఫికేషన్ సైతం అందిస్తుంది. కోర్సు మెటీరియల్స్‌ను ఓయో అభివృద్ధి చేయడంతో పాటుగా డిజైన్ కూడా చేస్తుంది మరియు ఈ కార్యక్రమం కోసం సీజన్డ్ ట్రైనర్స్‌ను సైతం అందిస్తుంది. ప్రస్తుత సవాళ్లతో కూడిన పరిస్థితులలో హోటల్/ప్రోపర్టీని నిర్వహించడంలో ఎదురవుతున్న సవాళ్లను హోటల్స్ మరియు ఆతిథ్య రంగ నిపుణులు ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని రూపొందించడంతో పాటుగా ఈ సవాళ్లను పరిష్కరించే సంబంధిత మార్గాలను సైతం రూపొందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం ఏర్పడింది.
 
ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత అభ్యర్థులను పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ విజయం సాధించిన వారికి కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్‌ను సైతం ఫిక్కీ అందిస్తుంది. కీలకమైన భద్రతా మార్గదర్శకాలను అమలు చేసేందుకు, వినియోగదారుల నమ్మకాలన్ని వృద్ధి చేసేందుకు మరియు కోవిడ్ అనంతర ప్రపంచంలో ప్రయాణాలు పునరుద్ధరించబడిన వేళ డిమాండ్ సృష్టికి సహాయపడుతుంది. ఆతిథ్య రంగంలో బలీయమైన కెరీర్‌ను నిర్మించేందుకు సైతం అభ్యర్థులకు ఈ కోర్సు మార్గాలను తెరుస్తుంది
 
ఈ కోర్సు గురించి రితేష్ అగర్వాల్, ఫౌండర్ అండ్ గ్రూప్ సీఈవో, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ మాట్లాడుతూ "కోవిడ్ తరువాత ప్రపంచంలో వినియోగదారులు మరియు హోటల్స్ అవసరాలను అర్థం చేసుకోవడానికి మేము అధికమొత్తంలో సమయాన్ని వెచ్చించాం. ఈ సర్టిఫికేషన్ కోర్సు ఆతిథ్య రంగ నిపుణులతో పాటుగా దేశ వ్యాప్తంగా హోటల్స్ ఇప్పుడు నూతన మార్గంలో పనిచేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనడంతో పాటుగా స్థానిక మరియు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సంపూర్ణంగా అర్థం చేసుకుని వాటికనుగుణంగా అత్యుత్తమ విధానాలు అనుసరించడం మరియు తమ కార్యకలాపాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా అటు వినియోగదారులతో పాటుగా ఇటు ఉద్యోగులు సైతం సురక్షితంగా, సౌకర్యంగా ఉన్నామన్న భావన కల్పించవచ్చు.
 
అంతర్జాతీయ హాస్పిటాలిటీ చైన్‌గా, మేము ఆతిథ్య పరిశ్రమలో అత్యుత్తమ ప్రక్రియలను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాము. మా అభ్యాసాంశాలను పంచుకోవడం మరియు భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆతిథ్యంకు సంబంధించి విజయవంతమైన భవిష్యత్‌ను సృష్టించడానికి కృషి చేస్తున్నాం. ఆ దిశగా మేము వేసిన ఓ ముందడుగు ఫిక్కీతో భాగస్వామ్యం. వారి మద్దతుకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం'' అని అన్నారు.
 
ఈ కోర్సు గురించి శ్రీ దిలీప్ చెనోయ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ మాట్లాడుతూ " భారతదేశంలో ఆతిథ్య రంగ పరిశ్రమలో వేలాది సంఘటిత, అసంఘటిత సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆర్థికావకాశాలతో పాటుగా స్థానిక పర్యాటకానికి ముఖ్యమైన తోడ్పాటుదారులుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయంగా అన్ని రంగాల వ్యాపారాలలోనూ నిర్వహణ ప్రక్రియల పరంగా బలవంతంగా మార్పులను కోవిడ్-19 తీసుకువచ్చింది. ఆతిథ్య రంగం అందుకు మినహాయింపేమీ కాదు.
 
అందువల్ల ఈ భారీ సంఖ్యలోని ప్రొఫెషనల్స్, హోటల్స్‌కు మద్దతునందించడం ద్వారా ఈ సంక్షోభాన్ని వారు అధిగమించేందుకు తోడ్పడటమే కాదు, వ్యాపార వృద్ధికి మరియు పర్యాటక సామర్థ్య పునరుత్తేజానికీ తోడ్పడుతుంది. ఈ కోర్సును ఏకరీతి స్వీయనియంత్రణ మార్గదర్శకాలను అభివృద్ధి చేయడానికి మరియు మన పరిశ్రమ కోసం సహాయక యంత్రాగం, విధాన చట్రం రూపొందించేలా సహాయపడటానికి తీర్చిదిద్దబడింది. తద్వారా వారు కోవిడ్ అనంతర ప్రపంచంలో క్రమబద్దీకరించిన మార్గదర్శకాలు, పారిశుద్ధ్య నిబంధనల నుంచి ప్రయోజనం పొందగలరు'' అని అన్నారు.
 
ఈ కార్యక్రమం గురించి తన ఆలోచనలను శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, గౌరవనీయ భారత ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు (ఇండిపెండెంట్ చార్జ్) మాట్లాడుతూ " చిన్న, మధ్య తరహా హోటల్ సంస్థలతో పాటుగా ప్రొఫెషనల్స్ సైతం అత్యున్నత ప్రమాణాలతో కూడిన పారిశుద్ధ్య, పరిశుభ్రత, నిర్వహణను పాటించడంలో మార్గనిర్ధేశకత్వం చేయడంలో భాగంగా ఫిక్కీ మరియు ఓయోలు సాంకేతికతపై ఆధారపడి ఈ సర్టిఫికేషన్ కోర్సును అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నాం. భారతదేశంలో అపారమైన పర్యాటక సామర్థ్యం ఉంది మరియు మన అతిథులకు సౌకర్యం అందిస్తూనే దేశవ్యాప్తంగా వారి ప్రయాణాలలో విశ్వాసం కలిగించే ఎలాంటి చర్య అయినా సరే దేఖో అప్నా దేశ్ మరియు ఇన్‌క్రెడిబుల్ ఇండియా అనే ద్వంద్వ లక్ష్యాలకు తోడ్పాటునందించడంలో ఎంతో దూరం వెళ్తుంది'' అని అన్నారు.
 
ఆతిథ్య రంగ పరిశ్రమలో మద్దతు యంత్రాంగాలను బలోపేతం చేయడానికి ఫిక్కీ మరియు ఓయోలు కట్టుబడి ఉండటంతో పాటుగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం కోసం ప్రభుత్వ ప్రయత్నాలలో పాల్గొనడానికి మరియు దేశంలో భవిష్యత్ ఆతిథ్యంకు తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉన్నాము.
 
తమ అతిథులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వసతి అనుభవాలను అందించడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడంలో భాగంగా ఓయో ఇటీవలనే శానిటైజ్డ్ స్టేస్ కార్యక్రమం ప్రారంభించింది. కోవిడ్ తరువాత అవసరాలను తీర్చడంలో సమగ్రమైన కార్యాచరణ నిర్మించే దిశగా వేసిన మరో ముందడుగు ఫిక్కీతో కలిసి ఈ కోర్సు ఆరంభించడం.