శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (16:14 IST)

ఇండియన్ బ్యాంక్ నుంచి 138 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ.. త్వరపడండి..

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఖాళీగా వున్న 138 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కింద ఈ భర్తీలు వుంటాయని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఫిబ్రవరి 10, 2020లోపు ఈ పోస్టులకు గాను అభ్యర్థులను దరఖాస్తులు సమర్పించాలసి వుంటుంది. 
 
మార్చి 8వ తేదీ ఇండియన్ బ్యాంక్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థులు దేశంలోని ఏ యూనివర్శిటీలోనైనా డిగ్రీ పూర్తి చేసి వుండాలి. ఇంకా ఎక్స్‌పీరియన్స్ వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. ఈ దరఖాస్తులను ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. 
 
indianbank.in/career అనే లింకును క్లిక్ చేసి ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌లను పూర్తి చేయాల్సి వుంటుంది. అఫ్లికేషన్ ఫీజు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు) ఇతర వర్గాల అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి వుంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తొలి రెండు పోస్టులకు పరీక్ష సమయం రెండు గంటలు, మార్కులు 200లకు వుంటుంది. 
 
మూడో పోస్టుకు గంట పాటే పరీక్ష వుంటుందని.. అది వంద మార్కులకే పరిమితం అవుతుందని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ పరీక్షల్లో అన్ రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 40శాతం మార్కులు సాధించాల్సి వుంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన వారు 35శాతం మార్కులు సాధించాలని ఇండియన్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.