బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:13 IST)

నీట్ పరీక్షలు రాసే పేద విద్యార్థులకు ఛాయ్ వాలా బాసట.. ఎలా?

నీట్ పరీక్షల కోసం విద్యార్థులు పడుతున్న తంటాలు అంతా ఇంతా కాదు. నీట్ పరీక్ష కోసం రాత్రింబవళ్లు నిద్రపోకుండా చదువుతూ.. కోచింగ్ సెంటర్ల వెంటూ తిరుగుతున్న విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది.

నీట్ పేరిట కోచింగ్ సెంటర్లు కూడా బాగా డబ్బులు గుంజేస్తున్నాయి. కానీ పేద విద్యార్థులు మాత్రం నీట్ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లాలంటేనే జడుసుకుంటున్నారు. కారణం ఫీజుల మోత. కానీ ఇక్కడ ఓ గణితశాస్త్రజ్ఞులు పేద విద్యార్థులకు నీట్ శిక్షణ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. 
 
ఆనంద్ కుమార్ అనే ఆయన టీ, కూరగాయలు అమ్మేవారి పిల్లలకు చేయూతనిస్తున్నారు. రైతన్న పిల్లలకు నీట్ పరీక్షపై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఆనంద్ కుమార్ వద్ద గట్టిగా కోచింగ్ తీసుకుంటున్నారు. జిందగి అనే ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వేతర సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు. 2016లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ జిందగీ కార్యక్రమం ప్రారంభమైంది. 
 
ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడి వున్న పేద కుటుంబాలకు చెందిన 19మంది బాలికలు, బాలురు ఈ కోచింగ్ సెంటర్లో వున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద, రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్యులు కావడానికి ఉచిత ఆహారం, వసతి శిక్షణ ఇవ్వబడుతుంది. 
 
ఈ శిక్షణ కేంద్రం నుంచి 2018లో 14మంది విద్యార్థులు నీట్ పరీక్షలో రాణించారన్నారు. వీరిలో 12 మందికి ఒడిశాలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం లభించింది. వైద్యులు కావాలనే వారికి కలలకు రెక్కలు మొలిచినట్లు ఈ శిక్షణ కేంద్రంలో చేరిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులకు తావుండదు. ఈ ఇన్సిస్టిట్యూట్‌ను టీ, షర్బత్ అమ్మే వ్యక్తి ప్రారంభించారు. 
 
అజయ్ బహదూర్ సింగ్ అనే ఆ వ్యక్తి జిందగీ అనే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యవిద్యను పక్కనబెట్టి టీ, షర్బత్ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దారిలేక టీ-షర్బత్ షాపును నడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితి పేద విద్యార్థులకు రాకూడదనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అజయ్ బహదూర్ సింగ్ వెల్లడించారు.