డిఫెన్స్‌లో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు- 39

jobs
jobs
సెల్వి| Last Updated: ఆదివారం, 17 జనవరి 2021 (15:53 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతో డిఫెన్స్‌లో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం ఇది. కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-ఎంటిఎస్, లోయర్ డివిజన్ క్లర్క్-LDC, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. https://www.mod.gov.in/ అనే
వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో పొందవచ్చు. దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

మొత్తం ఖాళీలు- 39
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.




దీనిపై మరింత చదవండి :