విజయవాడకు చేరుకున్న ఎస్ఐ- యుకె యూనివర్సిటీ ఫెయిర్
యుకె ఆధారిత అంతర్జాతీయ విద్యా సలహా సంస్థ, విశ్వసనీయ యుకె విశ్వవిద్యాలయ భాగస్వామి, ఎస్ఐ-యుకె ఇండియా విజయవాడలో యుకె యూనివర్సిటీ ఫెయిర్‌ను నిర్వహించనున్నట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ ఫెయిర్ 29 మే 2024న విజయవాడ లోని నోవాటెల్, వరుణ్ వద్ద ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య జరుగుతుంది.
అనేక సంవత్సరాలుగా, ఎస్ఐ - యుకె ఇండియా దేశవ్యాప్తంగా యుకె ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం, 10కి పైగా గౌరవనీయమైన యుకె విశ్వవిద్యాలయాలైన యూనివర్శిటీ కాలేజ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ సర్రే, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, యూనివర్శిటీ ఆఫ్ వాల్వర్‌హాంప్టన్, లండన్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ, నార్తంబ్రియా యూనివర్శిటీ, మరెన్నో యూనివర్సిటీల ప్రతినిధులు రానున్నారు. ఇక్కడ విద్యార్థులు తమ అకడమిక్ ఆఫరింగ్స్ గురించి సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు.
యుకెలో అందుబాటులో ఉన్న విభిన్న విద్యా అవకాశాలను అన్వేషించడానికి విద్యార్థులకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందించడం ఈ ఫెయిర్ లక్ష్యం. ఈ ఫెయిర్‌కు హాజరైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రొవైడర్‌లు, అడ్మిషన్స్ కన్సల్టెంట్‌లతో చర్చించే అవకాశం ఉంటుంది. ఎస్ ఐ -యుకె ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ అయ్యర్ మాట్లాడుతూ, “విద్యార్థులు భారతదేశం వెలుపల విద్యాపరంగా విజయం సాధించటానికి అవసరమైన మార్గాన్ని కనుగొనడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దిశానిర్దేశం చేయడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ ఫెయిర్ విద్యార్థులు ప్రతిష్టాత్మక యుకె విశ్వవిద్యాలయాలతో నేరుగా చర్చించేందుకు అవసరమైన వేదికను అందిస్తుంది. వ్యక్తిగతీకరించిన మద్దతుపై దృష్టి సారించి, ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ విద్యా ప్రపంచంలో విద్యార్థులు అభివృద్ధి చెందడానికి మార్గాలను అందించడమే మా లక్ష్యం" అని అన్నారు. నాగ్‌పూర్, ఢిల్లీ, చండీగఢ్, ముంబైలలో కూడా ఈ యూనివర్సిటీ ఫెయిర్ జరుగనుంది. ఎస్ఐ -యుకె నిపుణులు, యూనివర్సిటీస్ ప్రతినిధులతో ముఖాముఖి చర్చించేందుకు విద్యార్థులు india.studyin-uk.com/events/ని సందర్శించడం ద్వారా ఉచిత సెషన్‌ను బుక్ చేసుకోవచ్చు.