సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:06 IST)

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా వున్నారా?

పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా వున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 మే 2020. 617 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ఉద్యోగాలుంటాయి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వుంటుందని.. ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లో వుంటుందని సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ తెలిపింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.