శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (19:30 IST)

తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ తేదీ వెల్లడి...

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ నెల 25వ తేదీ బుధవారం రోజు ఈ ఫలితాలను వెల్లడించేందుకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తుంది. 
 
అలాగే, సెప్టెంబరు 1 లేదా 2న ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. 
 
ఈ ఫలితాల అనంతరం వ్యవసాయ, ఫార్మా(మెడికల్) ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితాలు విడుదలైన ఐదు రోజుల తర్వాత అంటే ఆగస్టు 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్నారు.