శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (10:57 IST)

కానిస్టేబుల్‌ ఉద్యోగానికి పీజీ, పీహెచ్‌డీలు : ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ పోలీస్‌ శాఖ ఇక మరింత బలవంతమైన నవ యువసేనగా మారేందుకు సిద్ధమవుతుంది. పోలీస్‌శాఖను బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నవారిపై పని భారం తగ్గించేందుకు వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆనలైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  

వెల్లువలా వచ్చిన దరఖాస్తులు మొత్తం 5,36,037కు చేరుకున్నాయి. జనవరి 11న ప్రారంభమైన ఆన్‌లైన్‌లో దరఖాస్తు గురువారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధిక మంది ఇంటర్‌తో పాటు డిగ్రీ, ఎంబీఏ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, బీటెక్‌, బి.ఫార్మసీ తదితర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించినవారే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో పురుషులు 4,53,148 కాగా మహిళలు 82,889 దరఖాస్తు చేసుకున్నారు. పోలీసింగ్‌లో పాతపద్ధతికి స్వస్తి పలుకుతుండటంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు చదివినవారు కూడా కాని స్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.

జిల్లాలవారీగా వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 దరఖాస్తులు అందినట్లుగా అధికారులు వెల్లడించారు.  ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం, పోలీస్‌ ఉద్యోగం పట్ల ఉన్న గౌరవం, ప్రజలకు సేవ చేసేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నందునే యువతరం ఈ రంగం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా కానిస్టేబుల్‌, ఎస్సై స్థాయిలో సుమారు 15 వేల యువ సిబ్బంది పోలీస్‌ శాఖలో చేరనున్నారు. 

జనాభా ఎక్కువగా ఉన్నా దరఖాస్తుల సంఖ్యలో నల్గొండ చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. కాగా, ఒక్కో అభ్యర్థి ఒక్క అప్లికేషన్ మాత్రమే ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని నియామక బోర్డు ఆదేశించినా కూడా కొంతమంది మల్టిపుల్‌ అప్లికేషన్స్ భర్తీ చేశారు. అలాంటి వారి విషయంలో చివరిగా పంపిన దరఖాస్తునే పరిగణనలోకి తీసుకుంటామని నియామక బోర్డు అధికారులు స్పష్టంగా వెల్లడించారు.

ఇక దరఖాస్తు సమయంలో ఫొటో, సంతకం విషయంలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ రోజు నుండి  11వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఫొటో, సంతకం సరిచేసుకోవాల్సిన అభ్యర్థులు [email protected] కు మొయిల్‌ చేస్తే అధికారులు లింక్‌ పంపిస్తారు.

సరిచేసుకోలేని వారికి ప్రిలిమినరీలో అర్హత సాధించాక తప్పులు సరిదిద్దు కునేందుకు అవకాశాన్నికూడా అధికారులు కల్పిస్తున్నారు. ఏప్రిల్‌ 3న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు హాల్‌ టికెట్లను మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నియామకబోర్డు అధి కారిక వెబ్‌సైట్‌ www.tslprb.in లో పొందు పరుస్తారు.

కాగా, ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో.. టెన్త్‌ వారు 32,970 మంది, ఇంటర్‌ ఉత్తీర్ణులు 2,94,606, బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ చేసిన వారు 1,29,021, బీ టెక్‌ వా 32,729, బీఫార్మసీ వారు 2959, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు 1,2617, ఎంసీఏ వారు 2544, ఎంబీఏ అభ్యర్థులు 12813, ఎంటెక్‌ వారు 1836, ఎంఫార్మసీ ఉత్తీర్ణులు 636, ఎంఫిల్‌ చేసినవారు 20, పీహెచ్‌డీ చేసినవారు 8 మంది ఉన్నారు.