1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (14:12 IST)

6 వాచ్‌మెన్ పోస్టులు... 25 వేల దరఖాస్తులు... 50 శాతం మంది పట్టభద్రులే....

దేశంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో ఈ సంఘటన మరోమారు కళ్ళకుకట్టింది. కేవలం ఆరు వాచ్‌మెన్ పోస్టులకు ఏకంగా 25 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 50 శాతం మంది నిరుద్యోగులు పట్టభద్రులు కావడం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) తన కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6 వాచ్‌మన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండి, 35 ఏళ్లకు పైబడిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొంది. 
 
అయితే, ఈ ఆరు పోస్టుల కోసం ఏకంగా 25 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. సరే, దాదాపు మూడేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదు కదా, అందుకే ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయని సర్దిచెప్పుకున్న ఈపీడీసీఎల్ సిబ్బంది దరఖాస్తులను తెరచి విస్తుపోయారట. ఎందుకంటే 25 వేల దరఖాస్తుల్లో సగానికి పైగా అప్లికేషన్లు గ్రాడ్యూయేట్ నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నాయి. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఎం తదితర డిగ్రీలు చదివిన వారితో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన వారూ వాచ్‌మన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారట.