శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By మోహన్
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (17:25 IST)

సిఏజీడిఐ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్

కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయింది. సెంట్రల్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్(సిఏజీడిఐ) నుండి 167 పోస్ట్‌లకు గానూ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
 
ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, బిజినెస్ రిప్రెజెంటేటివ్ వంటి పోస్ట్‌లను భర్తీ చేయనుంది. లాక్‌డౌన్ తర్వాత ఉద్యోగాల నిమిత్తం వెలువడుతున్న నోటిఫికేషన్‌లో ఇది ఒకటి కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 జూన్ 2020. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం www.cagdi.in వెబ్‌సైట్‌లో చూడండి.