బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:14 IST)

అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధిస్తూ రాణిస్తున్న కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ విద్యార్థులు

image
వివిధ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లలో తమ విద్యార్థులు విశేషమైన విజయాలను సాధిస్తున్నట్టు కె ఎల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం తెలియచేసింది. తమ అసాధారణ ప్రదర్శనలతో యూనివర్సిటీకి మాత్రమే కాకుండా, దేశం గర్వించేలా చేసిన విద్యార్ధులు తమకు గర్వకారణమని అధికారులు వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా వారి క్రీడా ప్రయత్నాలకు అన్ని విధాలా మద్దతు ఇవ్వడం కూడా  విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ చర్య, ప్రపంచ వేదికపై తమ విద్యార్ధుల నైపుణ్యం, సంకల్పాల అద్భుతమైన ప్రదర్శనకు దారితీసిందన్నారు. వివిధ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతిభావంతులైన విద్యార్థులు ఇటీవల సాధించిన విజయాలు- వారి అంకితభావం,  కృషికి మాత్రమే కాకుండా క్రీడాకారులను ప్రోత్సహించడ౦, శక్తివంతం చేయడంలో విశ్వవిద్యాలయం చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనం.
 
వివిధ అంతర్జాతీయ క్రీడా ఛాంపియన్‌షిప్‌లలో యూనివర్సిటీ విద్యార్థులు కె. ఎల్. డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం గొప్పగా గర్వించే ప్రదర్శన చేయడమే కాకుండా వారి అసాధారణ ప్రదర్శనలతో దేశానికి కీర్తిని తీసుకువచ్చారు. ముఖ్యంగా, దక్షిణ కొరియాలో జరిగిన "ISSF వరల్డ్ ఛాంపియన్‌షిప్ జూనియర్స్ 2023", 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మెన్ జూనియర్ విభాగంలో B. Tech (CSIT) మూడవ సంవత్సరం విద్యార్థి ఉమా మహేష్ మద్దినేని ప్రతిష్టాత్మకమైన కాంస్య పతకాన్ని సాధించారు, ఈ పోటీలో భారతదేశం నుండి 90 మంది షూటర్లు పాల్గొన్నారు.
 
ఇక, B. టెక్ 3వ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ విద్యార్థి సూర్య ఆకాష్ పోకల థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించి తన నైపుణ్యం ప్రదర్శించాడు. టర్కీలో జరిగిన జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న విద్యార్ధిని షేక్ సాదియా అల్మాస్, ప్రస్తుతం కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ నుండి BA (IAS) ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుతున్నారు. సాదియా తన అత్యుత్తమ ప్రదర్శనతో ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్యం, ఓవరాల్ సిల్వర్‌ పతకాలను గెలుచుకుని, విశ్వవిద్యాలయానికి, దేశానికి నిజమైన గర్వకారణంగా నిలిచింది. గతంలో న్యూజిలాండ్ 2022లో జరిగిన కామన్వెల్త్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 4 బంగారు పతకాలను కూడా గెలుచుకుంది.
 
ఈ అద్భుతమైన విజయాలకు, కె ఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులైన M. తీర్థ శశాంక్ మరియు బవనక వృషిన్ మరింత మెరుగుదిద్దారు. M. తీర్థ శశాంక్, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులతో టెన్నిస్‌లో గౌరవనీయమైన స్థానం సాధించాడు. MBA ఫిన్ టెక్ చదువుతున్నఈ విద్యార్ధి, ఇటీవల TPL (టెన్నిస్ ప్రీమియర్ లీగ్)  సీజన్ 4 సెలక్షన్ డే టోర్నమెంట్‌లో రాణించి, నగదు బహుమతిని గెలుచుకున్నాడు. జూనియర్ ర్యాంకింగ్‌ విభాగంలో  జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌ సాధించిన ఈ విద్యార్ధి, గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇక, నేపాల్‌లో జరిగిన సంఝనా కప్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో టీమ్ విభాగంలో స్వర్ణం మరియు కాంస్యం సాధించడం ద్వారా ఉత్తమ  ప్రతిభను కనబరిచాడు. వృషిన్, మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయరే  కాకుండా జాతీయ స్థాయి అథ్లెట్ కూడా.
 
ఈ నేపధ్యంలో కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ జి. పార్ధసారధివర్మ మాట్లాడుతూ, "కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీలో, మా విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభకు మేము పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా అద్భుతమైన మార్గదర్శకత్వం అందిస్తాము. మా విద్యార్థులకు వారి సంబంధిత క్రీడా ఈవెంట్‌లలో అత్యుత్తమంగా రాణించడానికి సహాయం చేస్తాము. మేము క్యాంపస్‌లో ఉత్సాహభరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సాహిస్తాము. మా విద్యార్థులు క్రీడా పోటీలలో భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించాలని, దేశానికి మరిన్ని పతకాలు సాధించడం ద్వారా భారతదేశ పతాకాన్ని ఎగురవేయాలని మేము కోరుకుంటున్నాము. దేశంలోనే అత్యుత్తమ క్రీడా వాతావరణాన్నినిర్మించడమే మా అంతిమ లక్ష్యం.
 
అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలో విశ్వవిద్యాలయానికి  ఒక గొప్ప చరిత్ర  ఉంది. ఇది విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహి౦చడమే కాకుండా, వారు  చదువు మరియు క్రీడలను సమతుల్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విశ్వవిద్యాలయం, అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు, ప్రతి క్రీడకు అంకితమైన కోచ్‌లు, అత్యుత్తమ అథ్లెట్లకు విద్యాపరమైన సౌలభ్యం, స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా, జాతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్‌లలో పాల్గొనే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విద్యార్ధులు  కెరీర్ మరియు క్రీడలు  రెండింటిలోనూ శ్రేష్ఠతను సాధించడానికి విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుంది.” అని తెలిపారు.
 
కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడాకారులకు 50% ఫీజు మినహాయింపును మంజూరు చేస్తుందని, వివిధ ఈవెంట్లలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన  విద్యార్థులకు 100% వరకు ఫీజు మినహాయింపు ఇస్తామని ఇంచార్జ్ లు డా. సి.హెచ్. హనుమంత రావు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ మరియు డాక్టర్ K హరి కిషోర్, అసోసియేట్ డీన్ (క్రీడలు) వివరించారు.