శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. తారాఫలం
Written By PNR
Last Updated : మంగళవారం, 12 ఆగస్టు 2014 (19:00 IST)

పుష్యమి నక్షత్రం.. 1వ పాదములో పుట్టిన వారైతే..?

పుష్యమి మొదటి పాదంలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. పుష్యమి తొలి పాదంలో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్ధశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని వేద పండితులు చెపుతున్నారు. 
 
అలాగే 19 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఈ జాతకులకు బుధ మహర్ధశ కావున పచ్చ రత్నమును బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలికి ధరిస్తే శుభ ఫలితాలుంటాయి. పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన జాతకులు 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్ధశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
 
అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి. ఇకపోతే.. 63-69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 
 
ఇదేవిధంగా 69-79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించగలరు. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని రత్నాల శాస్త్రం చెబుతోంది.