Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూర్యగ్రహ జాతకంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి?

శనివారం, 7 జూన్ 2014 (15:25 IST)

Widgets Magazine

సూర్యుడుది సాత్విక గుణం. అందువల్ల సూర్య బలం కలిగివుండే జాతకులకు రాజుకు సమాన హోదా కలిగిన జీవితాన్ని అనుభవిస్తారని జ్యోతిష్య పండితులు చెపుతుంటారు. రవి, దివాకరుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, భానుడు అని వేర్వేరు పేర్లతో ఆయనను పిలుస్తున్నారు. అగ్నిదేవతను తనలో కలిగి స్వీయ ప్రకాశశక్తిని నింపుకున్నసూర్యుడిని ప్రతినిత్యం సూర్య నమస్కారంతో పూజించే వారికి ఆరోగ్యం, ఆత్మబలం మెరుగుపడగలదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఆయన ద్వారానే జన్మలగ్నాన్ని లెక్కిస్తున్నారు కాబట్టి సూర్యుడు పితృకారకుడుగా భావిస్తుంటారు. 
 
చామంతి వర్ణంలో ఉండే సూర్యుడ్ని చీకటికి ప్రథమ శత్రువని కూడా అంటారు. పురుష గ్రహమైన సూర్యుడు మగ జాతకంలో బలం పొంది ఉంటే వారు గొప్ప మగసిరి కలిగి ఉంటారట. గౌరవం, శక్తియుక్తులు, ధైర్య సాహసాలు, సత్ప్రవర్తన, పలుకుబడి, ప్రభుత్వాధికారుల మద్ధతు వంటి వాటిలో మీకు మీరే సాటి. సూర్యుడు, శుక్రుడు మంచి స్థానాలలో ఉంటే ఆ జాతకుడికి వస్తు, కనక, గృహ రూపంలో ఆస్తులు చేకూరుతాయి. 
 
సూర్యుడు అంటే ప్రకాశవంతమైన విషయం అన్నది అందరికీ తెలిసిందే. పాప గ్రహంగా కొందరు చెబుతున్నప్పటికీ, నవగ్రహాలకు ఆయనే రాజుగా వెలుగొందుతున్నాడు.  కాస్యప ముని కుమారుడైన సూర్యుడిని వారం మొదటి రోజున పూజిస్తుంటారు. మహిళ జాతకంలో సూర్యగ్రహ బలం కలిగి ఉంటే ఆమె శీలవతి కాగలదు. సూర్యుడు తొమ్మిదో స్థానంలోఉంటే పిత్రార్జిత ఆస్తులు వెంటనే చేతికందగలవు. అంతేకాకుండా ఈ జాతకుడి తండ్రికి సైతం మంచి జరుగుతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

భవిష్యవాణి

news

విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని ...

news

ఫెంగ్‌షుయ్ ప్రకారం బ్యాగ్‌లను ఎంచుకోవడం ఎలా?

సాధారణంగా హ్యాండ్ బ్యాగులను ఎంచుకునేటప్పుడు ఆకారం, రంగుని దృష్టిలోకి తీసుకున్నట్లైతే ...

news

మీరు జూన్ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించారా?

మీరు జూన్ 3, 12, 21, 30 తేదీల్లో జన్మించారా.. అయితే ఉన్నత పదవులను అలంకరిస్తారని ...

news

మీది రేవతి నక్షత్రమా? పసుపు రంగు కర్చీఫ్ వాడండి!

దేవగణ నక్షత్రమైన రేవతిలో జన్మించిన జాతకులు నిరాడంబరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ...

Widgets Magazine