శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2014 (16:29 IST)

పిల్లలకు బబుల్‌బాత్ చేయిస్తున్నారా?

బబుల్‌బాత్ ద్వారా స్నానం చేయడమంటే ఏడుపు లగించుకునే పిల్లలను నవ్వించవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లలకి బబుల్‌బాత్‌ (నురగ స్నానం) ఎంతో బాగుంటుంది. స్నానం చేయించేటప్పుడు బాత్‌టబ్‌ లేకపోతే పిల్లలు కూర్చోవడానికి అనువుగా వుండేటబ్‌ని తీసుకోవాలి. దీన్ని నురగ నీటితో నింపాలి. పిల్లల చర్మానికి హాని కలిగించని సబ్బులు, ఆయిల్‌లనే ఉపయోగించాలి. 
 
అసాధారణమైన, వాసన, రంగులేనివి చూసి ఉపయోగించాలి.పిల్లలను ఎనర్జిటిక్‌, స్పోర్టివ్‌గా తయారుచేయడానికి బబుల్‌బాత్‌కి థెరెప్యూ టిక్‌ బాత్‌ని కలపాలి. బబుల్‌ బాత్‌కి సంబంధించినన్ని రకాల సీసాలున్నాయో వాటినన్నిటినీ టబ్‌కి అందుబాటులో ఉంచుకోవాలి. అలా బబుల్స్ ఏర్పాటు చేసి స్నానం చేయిస్తే పిల్లల ఏడుపును తగ్గించవచ్చు. 
 
అలాగే బాత్‌రూమ్‌లో బబుల్‌ బ్లోయింగ్‌ మిక్చర్‌తో బబుల్స్‌ బ్లో చేస్తే.. పిల్లలు వాటిని చూస్తూ హ్యాపీగా స్నానం చేస్తారు. ఇక చలికాలంలో పిల్లలు వేడి నీటితో స్నానంచేసి బయటకురాగానే వెచ్చటి టవల్‌, వెచ్చగా ఉన్న దుస్తులు తొడగాలి. బాత్ టాయ్స్ ఏర్పాటు చేసుకోవాలి.. ఇలా చేస్తే పిల్లలు ఏడ్వకుండా హ్యాపీగా స్నానం చేస్తారు.