శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జూన్ 2014 (18:06 IST)

బేబీ నిద్రపోతున్నప్పుడే నెయిల్స్ కట్ చేయండి!

బేబీ నిద్రపోతున్నప్పుడే నెయిల్స్ కట్ చేయండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. నెయిల్స్ కట్ చేయడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి తర్వాత నిద్రపుచ్చండి. తర్వాత గోళ్లను సాఫ్ట్‌గా కట్ చేయాలి. గోళ్లను కట్ చేశాక బేబీ ఆయిల్‌తో వారి కాళ్లు చేతుల వేళ్ళకు మసాజ్ చేయాలి. 
 
అలాగే చెవులను కూడా బడ్స్‌తో శుభ్రం చేయడం కూడా నిద్రపోయేటప్పుడే చేయాలి. న్యాపీని ప్రతి రెండు గంటలకొకసారి మార్చండి. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వల్ల తరచూ న్యాపిలు మార్చకుంటే, న్యాపిలు తడిగా ఉండటం వల్ల స్కిన్ రాషెస్ ఏర్పడుతాయి. అందుచేత బేబీ నిద్రించే సమయంలో చేయాల్సిన డైపర్ క్రీమ్‌ను అప్లై చేయండి. 
 
బేబి నిద్రించేప్పుడు చేయాల్సిన మరో పని, బేబీ హెయిర్‌ను ట్రిమ్ చేయడం. వారి తల చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.