శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 5 జనవరి 2015 (18:58 IST)

పిల్లలకు వైఫల్యాలను విడమరిచి చెప్పండి కానీ..?

పిల్లలకు వైఫల్యాలను విడమరిచి చెప్పండి కానీ ఎత్తిచూపకండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలు తప్పు చేసినప్పుడల్లా వైఫల్యాలను ఎత్తిచూపితే వారిలో ఆత్మవిశ్వాసం కనుమరుగవుతుంది. కొందరు పిల్లలు అభ్యసించడాన్ని ఇట్టే నేర్చుకుంటారు. ఇంకొందరు అలా నేర్చుకోలేకపోతారు. అంతమాత్రాన వారు పనికిరానివారని అర్థం కాదు. 
 
వారిలో అభ్యసించే లక్షణాన్ని పెంపొందించడానికి అటు టీచర్లు, ఇటు పేరెంట్స్ తమ వంతు కృషి చేయాలి. పిల్లల అభ్యాసం, అభ్యాస వైఫల్యాల్ని ఎదుర్కొనే విషయంలో ఇంట్లో పెద్దలు సున్నితమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.