గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (17:52 IST)

పిల్లల్లకు రోజూ ఓ టీ స్పూన్ బటర్ ఇవ్వొచ్చా?

పిల్లల్లకు రోజూ ఓ టీ స్పూన్ బటర్ ఇవ్వొచ్చా? బటర్ ఇస్తే ఒబిసిటీ తప్పదా? ఉదయం పూట పిల్లలు బటర్‌ను తీసుకోవచ్చా.? ఈ డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
బటర్ పిల్లల పెరుగుదలకు ఎంతో కీలకమైంది. ఇందులో విటమిన్, ఎ, డి, ఇ ఉన్నాయి. ఎండలో ఉన్నప్పుడు మన శరీరంలో డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఈ లోపాన్ని ఒక టీ స్పూన్ బటర్ భర్తీ చేస్తుంది.  
 
విటమిన్ డి లోపం ద్వారా ఏర్పడే ఎముకల సమస్యలను దూరం చేసుకోవాలంటే ఆహారంలో రోజుకు కొంతైనా బటర్ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత రోజూ పిల్లలకు ఓ టీ స్పూన్ బటర్ ఇవ్వడం ఉత్తమం. దీంతో పాటు నెయ్యి, చీజ్ కూడా పరిమితంగా తీసుకోవచ్చు. 
 
అయితే టీస్పూన్ కంటే ఎక్కువగా బటర్ తీసుకుంటే మాత్రం ఇక ఒబిసిటీ తప్పదు. కాబట్టి పిల్లలకు రోజూ ఓ టీ స్పూన్ బటర్ లేదా నెయ్యిని ఆహారంలో చేర్చి ఇవ్వొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.