శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (16:13 IST)

పిల్లల్లో నిద్రలేమి.. మొండితనానికి దారితీస్తుందట!

పిల్లల్లో నిద్రలేమి.. మొండితనానికి దారితీస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, అదేవిధంగా మెదడుకు నిద్ర అవసరం. 
 
10 ఏళ్లలోపు గల పిల్లలకు నిద్ర సరిపోకపోతే.. కోపం, మొండితనం అధికమవుతుంది. తద్వారా తోటిపిల్లలతో ఆడుకునేందుకు ఆసక్తి చూపరు. పాఠశాలకు వెళ్లమని మొండికేస్తారు. ఇంట్లో నిద్ర లేకపోతే.. క్లాస్ రూముల్లో నిద్రపోతారు. చురుకుదనం లోపిస్తుంది. ఎందులోనూ ఆసక్తి చూపరు. 
 
అంతేగాకుండా వయస్సు పెరిగే కొద్దీ పిల్లల్లో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. పిల్లల నిద్ర పట్ల నిర్లక్ష్యం చూపకండి. రాత్రి 10 గంటల్లోపూ పిల్లల్ని నిద్రపుచ్చాలి.
 
* రోజుకు ఎన్ని గంటలు నిద్ర కావాలనేది.. వయస్సును బట్టి మారుతుంటుంది. 
* శిశువులకు 18 నుంచి 20 గంటల పాటు నిద్ర అవసరం. 
 
* స్కూలుకు వెళ్లే పిల్లల్లో 9 నుంచి 10 గంటల సమయం కావాల్సి వుంటుంది. మధ్యాహ్నం పూట మరో గంట కావాల్సి ఉంటుంది. 
 
* 4 నుంచి 8 ఏళ్ల పిల్లలు 9 గంటలు, మధ్యాహ్నం గంట లేదా రెండు గంటల పాటు నిద్రపోవాలి. 
* టీనేజ్ పిల్లలకు 8 లేదా 9 గంటల పాటు నిద్ర అవసరం.  
 
* వృద్ధులకు ఆరు గంటల పాటు నిద్రే సరిపోతుంది. మధ్యాహ్నం పూట మరో గంట నిద్రపోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.