శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్
Written By Ganesh
Last Updated : బుధవారం, 4 జూన్ 2014 (14:37 IST)

చిన్నారులు హాయిగా నిద్రపోవాలంటే?

ఆరేడు నెలలు వచ్చిన దగ్గర్నుంచి రెండు మూడేళ్ల వరకూ పిల్లల్ని నిద్రపుచ్చాలంటే కొంచెం కష్టమైన విషయమే. దీని ప్రభావం తల్లిపైనా పడుతుంది. ఇలాంటప్పుడు విసుక్కోవడం, అసహానానికి గురికావడం వల్ల ప్రయోజనం లేదు. ముందే సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించాలి.

చాలా మంది చిన్నారులకు కడుపునిండా పాలు పట్టించి నిద్రపుచ్చాలనుకుంటారు. కడుపు నిండటం అవసరమే! కానీ పాలు తాగిన వెంటనే నిద్రపుచ్చాలనుకోవడం పొరపాటు. కాసేపు ఆటలాడించడం, కూర్చోబెట్టడం, అటూ ఇటూ తిప్పడం చేశాకే పడుకోబెట్టండి. శరీరానికి తగిన వ్యాయామం అంది అప్పుడే హాయిగా పడుకుంటారు. పిల్లలు పడుకోవడం లేదంటే చుట్టూ ఉన్న పరిసరాలేవైనా అసౌకర్యంగా ఉన్నాయేమో గమనించుకోండి. ఘాటైన వాసనలూ, దుర్వాసన వంటి ఇబ్బందులు లేకుండా చూడండి.

కళ్లపై జిగేలుమనే వెలుగూ, నేరుగా గదిలో పడే ఎండవేడి కూడా నిద్రలేమికి కారణాలేనని గుర్తించండి. పడుకునే ప్రదేశం ఎగుడుదిగుడుగా లేకుండా చూడండి. అలానే పడుకోబెట్టే ముందు తప్పనిసరిగా దుప్పటి దులిపి వేయడం మంచిది. పాపాయి మెత్తని శరీరానికి చిన్నది గుచ్చుకున్నా, తగులుకున్నా అసౌకర్యం కలిగి నిద్రలోకి జూరుకోలేరు.