శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జూన్ 2014 (13:06 IST)

మీ పిల్లలు ఎత్తు పెరగాలా? ఈ ఫుడ్ ఇవ్వండి!

మీ పిల్లలు వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగలేదని బాధపడుతున్నారా? మీ పిల్లలు నేచురల్‌గా ఎత్తు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారం ఇవ్వాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. ముఖ్యంగా సీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ పిల్లలు ఎత్తు పెరుగుతారు. సీఫుడ్స్ అనే చేపలు, రొయ్యల్లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు పెంచడంతో పాటు ఎత్తును కూడా పెంచుతాయి. 
 
కోడిగుడ్డులో విటమిన్ డి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలకు తగినంత క్యాల్షియం అందివ్వటంలో గుడ్డు బాగా సహాయపడుతుంది. ఇక ఎముకల్లో విటమిన్స్ మరియు క్యాల్షియం షోషణ జరగాలంటే సోయాప్రోడక్ట్స్‌ను మరియు సోయాబీన్స్ సోయా మిల్క్‌ను మీ పిల్లల రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి.
 
అలాగే జున్నులో క్యాల్షియం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. జున్ను తింటే పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఇది బరువు తగ్గడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.
క్యారెట్స్‌లో విటిమన్ సి మరియు ఎలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు పటిష్టమవుతాయి. అలాగే ఆకుకూరలు, పాలు పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 
 
పెరుగు ఒక డైరీ ప్రొడక్ట్. ఇందులో అధిక ప్రోటీనుల మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, డి, ఇలు ఉన్నాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. ఇకపోతే.. చికెన్‌లో అత్యధిక ప్రోటీనులు కలిగి ఉంటుంది. చికెన్ తినడం వల్ల తగినన్ని ప్రోటీనులను శరీరానికి అందిస్తుంది.