శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By ivr
Last Updated : మంగళవారం, 19 మే 2015 (15:56 IST)

రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ రెడీ అని తిన్నారో... ఏమవుతుందో చూడండి...

స్కూలు నుంచి పిల్లలు ఇంటికి రాగానే.... అమ్మా ఆకలి అంటూ పిల్లలు స్కూలు బ్యాగులు పక్కన గిరాటేసి ఇంట్లోకి పెరుగెడుతూ వస్తారు. వారి కోసం ఇదివరకు పేరెంట్స్ ఏ పకోడీలో, లేదంటే రొట్టెలో, కాదంటే ఏవో బిస్కెట్లో చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వాళ్లు ఆకలి అనగానే, స్టౌ పైన కొద్దిసేపు వేడినీళ్లు మరిగించి మ్యాగీ ప్యాకెట్ చించి నాలుగైదు నిమిషాల్లో చేసిన నూడుల్స్ ప్లేటుల్లో వేసి పిల్లల ముందు పెట్టేసి హేపీగా టీవీ ముందు కూర్చుంటున్నారు నేటి గృహిణిల్లో చాలామంది. 

 
కానీ మ్యాగీ పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు వైద్యులు. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ బ్రాండ్ మ్యాగీని పరీక్షించినపుడు ప్రమాదకర స్థాయిలో అందులో మొనోసోడియమ్ గ్లుటామెట్ ఉన్నట్లు గుర్తించారు. అసలు గ్లుటమేట్ అంటే ఏమిటో కూడా తెలియదు కదా. కానీ ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పిల్లలే కాదు.. మ్యాగీ పెద్దవారు తింటే వారిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది.
 
మొనోసోడియం గ్లుటమెట్ మోతాదుకు మించి మ్యాగీలో ఉపయోగిస్తున్నట్లు ఇటీవల కొన్ని షాపులపై చేసిన తనిఖీల్లో తేలింది. ఇది ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మ్యాగీని తీసుకునేవారిలో తలనొప్పి, చెమటలు పోయడం, ముఖం మండుతున్నట్లు అనిపించడం, మెడ ఇంకా ఇతర శరీర భాగాల్లోనూ మంటగా ఉన్నట్లు అనిపించడం జరుగుతుంది. అంతేకాదు బలహీనత కూడా వస్తుంది. 
 
దీర్ఘకాలంగా మొనోసోడియం గ్లుటమేట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకుంటే అది నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఇంకా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిజానికి మ్యాగీలో ఈ గ్లుటమేట్  0.01 పర్ మిలియన్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మ్యాగీల్లో ఈ స్థాయి 17 పర్ మిలియన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మోతాదులో ఉన్న మ్యాగీని తింటే ఇక ఆరోగ్యాన్ని అనారోగ్యంలోకి మనకి మనం నెట్టేసుకున్నట్లే అవుతుంది. మ్యాగీకి బదులుగా పిల్లలకు ఇంట్లో తాజాగా ఏదైనా వండి వడ్డించండి ప్లీజ్ అంటున్నారు వైద్యులు.