1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (15:51 IST)

పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు.. ఇతరులతో అస్సలు పోల్చవద్దు!

పిల్లల పట్ల నిర్లక్ష్యం వద్దు.. ఇతరులతో అస్సలు పోల్చవద్దని మానసిక నిపుణులు అంటున్నారు. పిల్లల్ని తప్పు చేసినప్పుడు బెదిరించకుండా నియంత్రించడం అలవాటు చేసుకోవాలి. మాట వినటానికి కొన్ని సార్లు బెదిరించటమే ఏకైక మార్గం అని భావిస్తారు. కానీ ఇది ఉత్తమమైన ఆలోచన కాదు. పిల్లల నుండి ఒక ప్రతికూల స్పందన పొందాలని అనుకుంటే ఎటువంటి సందేహం లేకుండా, పిల్లలను నియంత్రించడానికి ప్రయత్నించండి. 
 
పిల్లలతో మాట్లాడకపోవటం లేదా వారిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా, వారికి అవాంఛిత అనుభూతి కలుగుతుంది. తప్పు చేస్తే మాట్లాడకుండా శిక్షించుట వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అప్పుడు పిల్లల్లో చెడు అనుభూతి, అవమానం కలుగుతుంది.
 
ఇకపోతే.. పోలిక ఇతర పిల్లలతో పోల్చితే పిల్లలు కలత చెందుతారు. పిల్లల సామర్థ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇతరులతో పోల్చడం ద్వారా పిల్లలు తప్పకుండా నిరుత్సాహపడతారు. కుటుంబ సమస్యలు కూడా పిల్లల్ని కలవరపరుస్తుంది. పిల్లల పరిపక్వత స్థాయి తక్కువ కావడంతో వారిపై కుటుంబ సమస్యల ప్రభావం ఉండకూడదు. అందుచేత ఇంట్లో కొంచెం సానుకూల వాతావరణం ప్రతిదీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలని నిర్ధారించుకోండి.