శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (18:21 IST)

పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలి?

పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసా? పాలలోని పోషకాలు పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. క్యాల్షియం అందించే పాలతో మిల్క్ షేక్ చేయాలంటే... 
 
కావల్సిన పదార్థాలు: 
పాలు: మూడు కప్పులు 
వెనీల ఐస్ క్రీమ్: 3 బిగ్ స్కూప్స్
సిరఫ్ కోసం: 
పంచదార: 200 గ్రాములు 
నీళ్ళు: మూడు గ్లాసులు 
రోజ్ మిల్క్ ఎసెన్స్: రెండు టేబుల్ స్పూన్స్ 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ పాత్రలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి. నీటిని మీడియం మంటపై బాగా మరిగించాలి. ఇందులో పంచదార చేర్చి, కరిగిపోయాక రోజ్ మిల్క్ ఎసెన్స్‌ను జోడించి బాగా మిక్స్ చేయాలి. స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
 
బ్లెండర్‌లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. పిల్లలు ఇష్టపడి తాగుతారు.