శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (19:10 IST)

సాఫ్ట్ టాయ్స్ క్లీన్ కోసం హోం మేడ్ క్లీనర్!

ఇంట్లోని సాఫ్ట్ టాయ్స్‌ను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. బొమ్మలతో పిల్లలు అధిక సమయం గడపడంతో వాటిపై దుమ్ముధూళి పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుచేత సాఫ్ట్ టాయ్స్‌ను వారానికి లేదా మాసానికి ఒక్కసారైనా క్లీన్ చేయాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. సాఫ్ట్ బొమ్మలను శుభ్రం చేయడానికి ముందుగా డస్ట్ దులపాల్సి ఉంటుంది. అందుకు వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. హ్యాండిల్ బ్లో డ్రయ్యర్‌ను ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
 
అలాగే హోం మేడ్ క్లీనర్ తయారు చేసుకోవచ్చు. బొమ్మల మీద ఏర్పడ్డ మరకలను తొలగించడానికి 3చెంచాల డిష్ సప్ లిక్విడ్‌ను‌, 1/4చెంచా అమ్మోనియం మరియు 3/4నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ లిక్విడ్‌ను అప్లై చేసి టూత్ బ్రష్ తో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. అలాగే ఒక బౌల్ల్ వాటర్ లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి తర్వాత బొమ్మలకు అప్లై చేసి తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే టాయ్స్ శుభ్రంతో పాటు మెరుస్తూ ఉంటాయి.