శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (15:17 IST)

పిల్లలు ఈజీగా మాట్లాడాలంటే.. కథలు చెప్పండి!

వయస్సును బట్టి పిల్లలు మాట్లాడటం నేర్చుకుంటారు. అయితే పిల్లలు త్వరగా మాట్లాడాలంటే.. వారికి తల్లిదండ్రులు కథలు చెప్పాలి. మాటలు సులభంగా వచ్చేట్టు.. వారితో అప్పుడప్పుడు మాట్లాడాలి. 
 
ఆట వస్తువులతో ఆడుకునేటప్పుడు ఆడుకునే ప్రతి వస్తువు పేరు, దాని గురించి చెప్పడం,..లాంటివి చేస్తే వాళ్ళలో వినికిడి శక్తి పెరుగడంతో పాటు గ్రాహ్యాశక్తి పెరిగి మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
 
చాలా మంది పిల్లలు కథలు వింటూ నిద్రపోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. దీని వల్ల పిల్లల్లో గ్రాహ్యశక్తితో పాటు ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ చాలా మాటలు వినడం వల్ల ఇందులో నుంచి కొన్ని మాటలైనా వాళ్ల మనస్సుల్లో నాటుకుపోతాయి. దీంతో నెమ్మదిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
 
పిల్లలకు మాటలు రావాలంటే తల్లిదండ్రులే టీచర్లుగా మారాలి. ఉదాహరణకి మీరు పిల్లల్ని ఆడిస్తూ టీవీ చూస్తున్నారనుకోండి. అందులో ఏవైనా జంతువులల్లాంటివి కనిపిస్తే వాటి పేర్లు చెప్పడం లాంటివి చేయాలి. అలాగే ఏదైనా బొమ్మల పుస్తకం, ఇంగ్లీష్ లేదా తెలుగు అక్షరమాల పుస్తకం చూపిస్తూ వాటి పేర్లు చెప్పడం..ఇలా కూడా చేయవచ్చు. 
 
మనం చెప్పిన పదాలను తప్పులు లేకుండా పలకరు. వాళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. కాబట్టి, స్పష్టంగా పలకలేరు. అందువల్ల వాళ్లు పదాల్ని స్పష్టంగా పలకాలంటే తల్లిదండ్రులే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.