శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 డిశెంబరు 2020 (20:29 IST)

ఈ ఏడాది బాదములతో ఇంటి వద్దనే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోండి

అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే, మురిపించే సమయం ఎట్టకేలకు వచ్చింది. ఆహ్లాదకరమైన భావన, సంతోషం మన చుట్టూ ఉన్న పరిసరాలను నింపుతున్నప్పుడు, మనస్ఫూర్తిగా దానిని ఆలింగనం చేసుకుందామని కోరుకుంటుంటాం. క్రిస్మస్‌ పండుగ సమీపించిన వేళ, పండుగ సంతోషాలు మరియు వేడుకలలో మునిగితేలుతుంటాం.
 
దేశవ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా పండుగల కోసం సిద్ధమైన వేళ, అంటే ఇంటిని అందంగా అలంకరించుకోవడం, బహుమతులను పంచుకోవడం, వర్ట్యువల్‌గా కుటుంబ సమావేశాలను నిర్వహించడం, పసందైన విందు, తియ్యందనాలు సిద్ధం చేయడం... భౌతిక దూర కాలంలో కూడా ఆనందం మాత్రం అతిసన్నిహితంగా మెలుగుతూనే ఉంటుంది. ఈ సెలవుల సీజన్‌లో, మీ కుటుంబం, మీ ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించి క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోవడం గురించి ఈ సూచనలు.
 
క్రిస్మస్‌ మూవీ మారథాన్‌తో మీ కుటుంబంతో అనుబంధం పెంచుకోండి, ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఉంచుకోండి.
పండుగలకు సిద్ధమవుతున్న వేళ, కుటుంబంతో సమయం గడిపేందుకు ఖచ్చితమైన మార్గంగా హాలీడే చిత్రాలను కలిసి చూడడం. సుదీర్ఘమైన వారాంతాలలో విశ్రాంతిపొందడం లేదంటే బహుమతులు సిద్ధం చేయడం వంటి సమయాలలో ఈ సినిమా వీక్షణం మరింత ఆహ్లాదంగా ఉంటుంది. కానీ బింగీ వాచింగ్‌ దగ్గరకు వచ్చేసరికి, మనలో చాలామంది అనారోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇవి ఎన్నో కారణాల రీత్యా ఆరోగ్యానికి హానికరమైనవి. దీనిని నిరోధించడానికి అత్యుత్తమ మార్గం ఏమిటంటే, సంప్రదాయ అనారోగ్యకరమైన స్నాక్స్‌ను ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాలు అయినటువంటి బాదములో నింపడం. ఇవి రుచికరంగా ఉండటం మాత్రమే కాదు, పౌష్టికాహార మార్గంగానూ సినీ ప్రేమికులకు నిలుస్తుంది.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘కుటుంబంతో కొంత నాణ్యమైన సమయం గడిపేందుకు అత్యుత్తమ మార్గంగా క్రిస్మస్‌ నిలుస్తుంది. అలాగే అనుబంధాలను మెరుగుపరుచుకునేందుకు, పలు కార్యక్రమాలలో మునిగి తేలడానికి కూడా ఇది సందర్భంగానూ నిలుస్తుంది. మా కుటుంబంలో, మా పిల్లలు నిద్రలోకి జారుకున్న తరువాత హాలీడే మూవీ మారథాన్‌ చేస్తుంటాం. క్రిస్మస్‌ రోజున ఇది ప్రతి సంవత్సరం ఓ సంప్రదాయంగా చేస్తుంటాం. సినీ వీక్షణ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినడం బదులుగా నేను ఓ గిన్నెడు స్పైసీ లేదా ఫ్లేవర్డ్‌ బాదములను సిద్ధం చేస్తుంటాను. రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన స్నాక్‌గా సినీ వీక్షణ  సమయంలో బాదములు నిలుస్తాయి. ఇది మా కుటుంబ బరువును నియంత్రణలో ఉంచేందుకు ఈ హాలీడే సీజన్‌లో తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
ఆలోచనాత్మక బహుమతులను పంచుకోండి, ఇవి చక్కటి శుభాకాంక్షలనూ అందిస్తాయి
క్రిస్మస్‌ పండుగ రోజున బహుమతులను మార్చుకోవడమనేది ఆహ్లాదకరమైన మార్గం. మనకు ఇష్టమైన వ్యక్తుల పట్ల ప్రేమ, కృతజ్ఞతలను వెల్లడించడానికి ఇది అత్యుత్తమ మార్గం. ఈ సంవత్సరం మరో అడుగుముందుకేసి, పౌష్టికాహార బహుమతులను పంచుకోండి. ఇవి బహుమతులను అందుకున్న వారిపై సానుకూల ప్రభావం చూపుతాయి. సంప్రదాయ బహుమతులను ఎంచుకోవడం బదులుగా, బాదములు లాంటి నట్స్‌ను సరఫరా చేయండి. ఇవి చక్కటి ఆరోగ్యపు బహుమతులుగానూ నిలుస్తాయి.
 
షీలా కృష్ణ స్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ఎన్నో కారణాల రీత్యా 2020 సంవత్సరం ప్రత్యేకమైనది. అయితే మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యం, జీవనశైలి పట్ల మరింతగా దృష్టి కేంద్రీకరించాలని తెలిపింది. దీనినే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోవాలనీ వెల్లడించింది. ఈ సంవత్సరం, ఆలోచనాత్మకంగా బాదములు లాంటి బహుమతులను ఎంచుకోవడం ఎక్కువగా కనిపించింది. ఆ బహుమతులు దీర్ఘకాలంలో  బహుమతులు అందుకున్న వారి సంక్షేమం కోసం తపననూ సూచిస్తాయి. బాదములు వల్ల అపారమైన ప్రయోజనాలున్నాయి. టైప్‌2 మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి వాటి నివారణకు సైతం ఇవి తోడ్పడతాయని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి..’’అని అన్నారు.
 
సంతోషానికి స్వాగతం చెప్పండి, వినోదాత్మక ఫిట్‌నెస్‌ వేడుకలతో కుటుంబంతో అనుబంధం పెంచుకోండి
క్రిస్మస్‌ సమయం మరియు సంవత్సరాంతం తమతో పాటు అపారమైన పండుగ ఫుడ్‌, సంతోషాలను తీసుకువస్తాయి. ఇవి ఓ వ్యక్తి యొక్క ఫిట్‌నెస్‌ ప్రణాళికలను పక్కకు తప్పిస్తాయి. కానీ దీనిని ఓ అవరోధంగా భావించకుండా, మీ కుటుంబంతో అనుబంధం పెంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం వినూత్నమైన మార్గంలో క్రిస్మస్‌ను వేడుక చేసుకోండి. ఇందుకోసం ఫ్యామిలీ ఫిట్‌నెస్‌ కార్యక్రమాలను ప్రణాళిక చేయండి. ఇవి ప్రతి ఒక్కరూ అనుసంధానితంగానే కాదు ఆరోగ్యంగానూ ఉండేందుకు తోడ్పడతాయి.
 
ఫిట్‌నెస్‌ నిపుణులు మరియు సెలబ్రిటీ మాస్టర్‌ శిక్షకులు యాస్మిన్‌ కరావాలా మాట్లాడుతూ, ‘‘క్రిస్మస్‌ పండుగలు సాధారణంగా తమతో పాటుగా లీనమయ్యేరీతిలో భోజనాలను సైతం తీసుకువస్తాయి. ఈ కారణం చేత అవాంఛితంగా బరువు పెరగడమూ సాధ్యమవుతుంది. దీనిని నిరోధించడానికి అత్యుత్తమ మార్గం మీ ఫిట్‌నెస్‌ రొటీన్‌ను సరిగా నిర్వహించడమే. పండుగ సంబరాలలో కూడా  ఇది అవసరం. మీరు గ్రూప్‌ పిలాట్స్‌ తరగతులు ప్రణాళిక చేయడంతో పాటుగా డ్యాన్స్‌ లేదా యోగా తరగతులనూ నిర్వహించుకోవచ్చు మరియు నగరంలోని కటుంబసభ్యులను ఒకే దగ్గరకు తీసుకువచ్చినట్లుగా వర్ట్యువల్‌ మీట్‌ను నిర్వహించి వేడుకలనూ చేయవచ్చు.
 
అంతేకాదు, గ్రూప్‌ వర్కవుట్‌ను సప్లిమెంట్‌ చేసూఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అయినటువంటి బాదములను తమ ప్రొటీన్‌ మరియు ఫైబర్‌ అవసరాల కోసం వినియోగించవచ్చు. తద్వారా తమ ఆకలినీ తీర్చుకోవచ్చు. భోజనాల నడుమ సంతృప్తిని అందించే ఆరోగ్యవంతమైన ప్రాధాన్యతలు కారణంగా ఎక్కడపడితే అక్కడ, ఏవి పడితే అవి తినే అవసరాన్ని సైతం తప్పిస్తుంది. అంతేకాదు, బరువు నియంత్రణలో ఉంచుకోవడమూ సాధ్యమవుతుంది.అంతేకాదు, మీరు బాదములను గ్రూప్‌ వర్కవుట్‌  సెషన్‌లు ముగిసిన తరువాత కూడా చక్కటి వర్కవుట్‌ స్నాక్‌గా తినవచ్చు’’ అని అన్నారు.
ఆరోగ్యవంతమైనది వండండి, అయినప్పటికీ పండుగ డిషెస్‌ను మిళితం చేయండి
వేడుకలలో ఓ భాగం వంట. ఇది మనల్ని కుటుంబానికి అతి సన్నిహితంగా, భావోద్వేగపరంగా సన్నిహితం చేస్తుంది. అది డెస్సర్ట్‌ కానీయండి లేదా మెయిన్‌ కోర్స్‌ లేదా కేవలం సూప్‌ అయినా సరే, కుకింగ్‌ ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఈ క్రిస్‌మస్‌ వేళ, మీ కుకింగ్‌కు ఆరోగ్యవంతమైన మలుపును ఇవ్వండి మరియు ఆరోగ్యవంతమై న పదార్ధాలైనటువంటి బాదములను ఈ తయారీలో భాగం చేయండి.
 
రీజనల్‌ హెడ్-డైటిటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్- ఢిల్లీ, రితికా సమద్ధార్‌ మాట్లాడుతూ, ‘‘క్రిస్మస్‌తో పాటుగా సంవత్సరాంతపు వేడుకలలో, మనలో చాలామంది అనారోగ్యకరమైన వంటకాలు చేయడంతో పాటుగా వాటినే తింటుంటారు. మన ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండానే ఇది చేస్తారు. నట్స్‌ లాంటి బాదములను మన డిషెస్‌లో జోడించడం వల్ల  మీ క్రిస్మస్‌ మీల్స్‌లో ఆరోగ్యం జోడించవచ్చు. దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యంపై ఆరోగ్యవంతమైన ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం, 42 గ్రాముల బాదములను ప్రతి రోజూ తీసుకుంటే అది గణనీయంగా ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉదరం దగ్గర కొవ్వునూ తగ్గిస్తుంది. దీనితో పాటుగా గుండె జబ్బులనూ నివారిస్తుంది’’ అని అన్నారు.
 
మాధురి రుయా, పిలాట్స్‌ ఎక్స్‌పర్ట్‌ మరియు డైట్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సంవత్సరం క్రిస్మస్‌ను వైవిధ్యంగా ప్రణాళిక చేయండి. మీ పండుగ సంబరాలలో ఆరోగ్యవంతమైన రెసిపీలను జోడించండి. ఆరోగ్యవంతమైన ఆహారం, రుచికరంగా తయారుచేసుకోండి. పలు ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండేటటువంటి బాదములు వైవిధ్యమైన పదార్థంగా నిలువడంతో పాటుగా ఎన్నో క్రిస్మస్‌ స్ఫూర్తిదాయక రెసిపీల తయారీలోనూ తోడ్పడుతుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములు ప్రతి బైట్‌లోనూ చక్కదనం అందిస్తాయి మరియు పోషకాల నిలయంగానూ ఉంటాయి’’ అని అన్నారు.
 
మీ క్రిస్మస్‌ వేడుకలకు అదనపు సంతోషాన్ని జోడించేందుకు అనువుగా ఉండే రెసిపీ ఇది.. స్పైస్డ్‌ ఆల్మండ్‌ బనానా జాగరీ కేక్‌
కావాల్సిన పదార్థాలు- పరిమాణం
వెన్న (ఉప్పులేకుండా)- అరకప్పు
బెల్లం పొడి- అరకప్పు
దాల్చిన చెక్కపొడి-ఒకటిన్నర టీస్పూన్‌
జాజికాయ పొడి- పావు టీ స్పూన్‌
బాదం- అరకప్పు
పంచదార- మూప్పావు కప్పు
గుడ్లు- 3
ఆరెంజ్‌ జెస్ట్‌- 2 టీస్పూన్‌
అరటిపండు (పండినది, గుజ్జుగా చేసుకున్నది)- పావు కప్పు
మైదా- 3 కప్పులు
బేకింగ్‌ పౌడర్- ఒకటిన్నర టీ స్పూన్‌
బేకింగ్‌ సోడా- ఒక టీస్పూన్‌
ఉప్పు- అర టీ స్పూన్‌
మజ్జిగ- కప్పులో రెండొంతులు
 
తయారీ విధానం:
ముందుగా పావు కప్పు వెన్న కరిగించాలి. రెండు టేబుల్‌ స్పూన్‌ల కరిగించిన వెన్నను తీసుకుని పాన్‌లో అన్ని వైపులా కలిసేలా రాయాలి. తరువాత బెల్లం, దాల్చిన చెక్క, జాజికాయ, బాదం కలపాలి. ఈ మిక్స్‌లో నుంచి సగం పాన్‌లో ఉంచి మిగిలిన సగాన్ని కరిగించిన వెన్నలో కలిపి పక్కన పెట్టాలి.
 
ఓ పెద్ద గిన్నెలో మిగిలిన పావు కప్పు వెన్నను తీసుకుని దానిలో పంచదార బాగా కలపాలి. దానిలో గుడ్లు, అరటి కలపాలి. దీనిలో మైదా, సోడా, ఉప్పు కలిపి, దానిలోనే మజ్జిగ కూడా కలపాలి. ఇలా తయారైన పిండిని పాన్‌లో సగం వేసుకుని, దానిపై బెల్లం మిక్స్‌ వేసి ఆ పైన మిగిలిన పిండిని పోసుకోవాలి.
 
ఇప్పుడు ఓ పాన్‌లో బాటర్‌ను సగం పోసి, దానిపై మిగిలిన బెల్లం, పంచదార మిక్సర్‌ను సమానంగా చల్లి ఆ పైన మిగిలిన పిండి పోసుకోవాలి. ఈ మొత్తాన్నీ 180 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఓవెన్‌లో లాంగ్‌ఉడ్‌ స్కీవర్‌పై బేక్‌ చేయాలి. దాదాపు 50 నిమిషాల తరువాత ఇది పూర్తిగా బేక్‌ అవుతుంది. ర్యాక్‌పై ఓ ఐదు నిమిషాలు ఆరనిచ్చి ఆ తరువాత కేక్‌ను సర్వింగ్‌ ప్లేట్‌పై తలకిందులు చేయాలి. వేడిగా ఉన్నప్పుడు లేదా చల్లబడిన తరువాత సర్వ్‌ చేసుకోవచ్చు.