Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి

సోమవారం, 4 డిశెంబరు 2017 (17:35 IST)

Widgets Magazine
Jesus

విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం యేసు బోధనలలోనే దొరుకుతుంది. దానిని ఎలా నీకొదేము అనే విద్యావేత్త పరిశోధించాడో తెలుసుకుందాం. యూదుల అధికారి నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన (యేసు) యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవరును చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహోను 3:1-4)
 
పరిసయ్యులు ఎవరు?
పరిసయ్యులు యూదా మత పెద్దలు. దేవుడు, మోషేల ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు. బాహ్య ప్రపంచానికి మాత్రం భక్తిపరులుగా కనిపిస్తారు. ధర్మశాస్త్రంలో, పాపంలో పట్టుబడిన వారు రాళ్ళతో కొట్టి చంపాలి. శరీరంలో ఏ భాగంతో పాపం చేస్తే, ఆ భాగాన్నీ నరికేసేవారు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అలాంటి మత పెద్దలలో నీకొదేము ఒకరు. యేసు చేసిన అద్భుతాలు, స్వస్థతలు చూసి ఆశ్చర్యపోయారు. 
 
ఆయన నిజంగా దేవుని ద్వారా సూచక క్రియలు చేస్తున్నారని నమ్మాలి. దేవుని రాజ్యంలో తానూ ప్రవేశించాలని ఆశతో యేసును విచారించడానికి వచ్చాడు. సమాజానికి భయపడి, అధికారియైన నీకొదేము రాత్రివేళ యేసు దగ్గరకు వెళ్ళాడు. యేసు బోధలను, సూచక క్రియలను వ్యతిరేకించిన వారిలో నీకోదేము ఒకరు. అతడు మదాధికారియైనా సత్యం తెలియని వ్యక్తి. ఆ సత్యాన్నీ తెలుసుకోవడానికే యేసు వద్దకు వచ్చాడు.
 
యేసే రక్షకుడని విశ్వసించాలి
యేసు తన దగ్గరకు వచ్చే ఎవరినైనా తిరిగి పంపరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసే రక్షకుడని హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగే శక్తి ఉన్నది. యేసుతో మాట్లాడి సత్యం తెలుసుకొన్నాడు నీకొదేము. ముసలి వాడయినను చీకటిలో వచ్చి, యేసు వాక్యపు వెలుగును పొందాడు. నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి అని పలికాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మంగళవారం 21 లడ్డూలు హనుమంతునికి సమర్పిస్తే?

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా ...

news

ఇకపై శ్రీవారి ప్రసాదం చేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా ...

news

శ్రీవారి ఆలయం ఎదుట పందుల సంచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల ...

news

ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఇకపై టైమ్‌స్లాట్ విధానాన్ని అమలు ...

Widgets Magazine