బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 జులై 2014 (13:34 IST)

సూపర్.. సూపర్ టిప్స్: పాలు మాడిపోతే.. ఓ తమలపాకు చాలు!!

సూపర్ సూపర్ కుకరీ టిప్స్ కావాలా.. అయితే ఈ స్టోరీ చదవండి. పాలు పొయ్యిపై పెట్టి మాడువాసన వచ్చేసిందా? అయితే ఇక బాధపడొద్దు.. అందులో ఓ తమలపాకు వేసేయండి. మాడు వాసన మాయమవుతుంది. 
 
* రెండు అరటి పండ్లు, కొంచెం పంచదార మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒకటిన్నర గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీరు పోసి మరిగించండి. ఇందుకు మీకు నచ్చిన ఎసెన్స్ కలుపుకోండి. కొత్తరకం పాయం రెడీ.
 
* హల్వా చేస్తున్నారా.. వెన్నను కరిగించి పక్కనబెట్టుకోండి. ఈ వెన్నను కొంచెం కొంచెంగా హల్వాలో చేర్చుకుంటే హల్వాకు కొత్త రుచి వచ్చేస్తుంది.  
 
* వెల్లుల్లి పాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని పాలతో కలిపి రోజూ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వెన్నను మరిగించేటప్పుడు అర స్పూన్ మెంతుల్ని వేస్తే నెయ్యి సూపర్ వాసనతో ఘుమఘుమలాడుతుంది. 
 
* ఇక నీటికి బదులు పాలతో రవ్వ కేసరి చేస్తే.. పాలకోవాలా సూపర్ టేస్ట్‌ను ఇస్తుంది. బాదుషా చేసే పిండికి సోడా, డాల్డాతో పాటు కొంచెం పుల్లని పెరుగును చేర్చుకుంటే మృదువైన బాదుషాలు రెడీ. బీట్‌రూట్‌ను పాలలో ఉడికించి హల్వా చేస్తే సూపర్ టేస్ట్ ఇస్తుంది. వర్షాకాలంలో దోసెపిండి పులుపెక్కకపోతే.. కొబ్బరి నీరు చేర్చుకోండి.