గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 మే 2015 (15:23 IST)

ఇల్లాలికి త్రీ టిప్స్: కోడిగుడ్డు సొనలో పాలు కలిపితే..

కోడిగుడ్డు సొనలో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపితే ఆమ్లెట్ రుచిగా ఉంటుంది. అలాగే ఒక టీ స్పూన్‌ ఉల్లిరసంలో తేనె కలుపుకుని రోజుకు మూడు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పిల నుంచి ఉపశమనం కలుగుతుంది. దుస్తులకు గంజి పెట్టే సమయంలో కొన్ని చుక్కలు గ్లిజరిన్ కలిపినట్లయితే వస్త్రాల పొరలు ఒకదానికొకటి అతుక్కోవు. దీనివలన ఇస్త్రీ చేయడం సులువవుతుంది. 
 
అలాగే పొటాటో బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి. బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్‌లో ఉంచితే కరకరలాడతాయి. ఇక బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అవుతుంది. బాణలిలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు.